Tuesday, April 28, 2009

మొదటి ప్రేమ లేఖ

నా ప్రాణమా....

ఇపుడు చెప్పు నిన్ను వదిలి నేను ఉండగలనా?
ఎందుకంటే నాకు అన్నింటికన్నా...అంతెందుకు నాకన్నా...నువ్వే ఎక్కువ. నాకు చిన్న పిల్లలంటే ఎంతిష్టమో...
కల్మషం లేని మంచి మనసు వారి సొంతం, అదే నీ సొంతం , అదే ఇపుడు నా సొంతం కూడా... ఎందుకంటే
నువ్వు నా సొంతం.

ఒకటి చెప్పనా... ప్రకృతికి నీకు చాలా దగ్గరి పోలికలున్నాయి తెలుసా? అది మారుతూ ఉంటుంది. నీ లాగే...
నీ కోపాన్ని ఎండాకాలం అనుకుంటే అది నాకు చాలా ఇష్టం,ఎందుకంటే మద్యాహ్నం ఎండా భరించలేకపోయినా...
కాలంలో తెల్లవారుఝామున...సాయం సంధ్యల్లో...ఎంత బావుంటుందో కదా!... నీ కోపం కూడా అంతే అందుకే నాకు చాలా ఇష్టం. తగ్గాక జీవితానికి సరిపడా ప్రేమను ఇస్తావు.

నీ మౌనాన్ని శీతాకాలం అనుకుంటే అది ఎంత వెచ్చదనాన్ని ఇచ్చి,... స్వప్నలోకంలో విహరించేలా చేస్తుంది.
నీ కోపం తగ్గాక నిన్ను నాదగ్గరికి తీసుకుంటే చిన్నపాపలా ఒదిగిపోతావు...అపుడు ఆలోకం నా దగ్గరే ఉంటుంది.
అందుకే అదన్నా నాకు చాలా ఇష్టం.

ఇక నీవు సంతోషంగా నవ్వుతూ ఉంటే నాకు వర్షాకాలమే కదా!... అది నచ్చని వారెవరుంటారు? నాకు చాలా ఇష్టం.

కోపం , మౌనం , సంతోషం మూడూ ఎక్కువైతే? అమ్మో...
ఎండ ఎక్కువైతే చిరాకు,
చలి ఎక్కువైతే మనసు బాగోదు, నిద్ర పట్టదు,
వర్షం ఎక్కువైనా ఇబ్బందే కదా!...

కానీ నాకా భయం లేదు... వీటిని అదుపు చేసే ఆయుధం నీ దగ్గరుంది... అదే అర్థం చేసుకునే మంచి మనసు.
నువ్వు నా సర్వస్వం... నువ్వు నన్ను నాకన్నా బాగా అర్థం చేసుకుంటావు. నామీద నీ ప్రేమ, నన్ను అదుపులో పెట్టేందుకు వాడే అధికారం... ఇంత నచ్చాయని ఎలా చెప్పగలను?... అనుభూతులకు అక్షర రూపం ఇవ్వలేనేమో?

నీ ప్రేమను పొందిన క్షణం ఎలా మరచిపోగలను?అదొక గొప్ప విజయం. గడచిపోయిన కాలంలో నువ్వు నన్ను బాధపెట్టినట్టు గుర్తు లేదు. నీమీద నాకున్న అదుపులేని ప్రేమను నీకందించాలనే ప్రయత్నం లో నిన్ను బాధపెట్టుంటే నన్ను క్షమిస్తావు కదూ. మన జీవితానికీ , ప్రేమకీ పునాది నమ్మకం. అది ఒకరినొకరు అర్థం చేసుకుని ఎప్పుడూ కలిసుండేలా చేస్తుంది.

ఇది ఒక చిన్న ప్రయత్నమే కానీ , నా ప్రేమను ఉన్నదున్నట్టు వ్యక్తపరచడానికి కాగితాలు సరిపోతాయా?
అందుకే ఒకటి చెప్పనా... నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
ఎప్పటికైనా నేను నీ సొంతం...చీచీ...అలా కాదు. ఎప్పటికీ నేను నీ సొంతం.... సరేనా.... నీ నేను.




3 comments:

  1. "నాకున్న అదుపులేని ప్రేమను నీకందించాలనే ప్రయత్నం లో నిన్ను బాధపెట్టుంటే నన్ను క్షమిస్తావు కదూ" Beautiful!

    ReplyDelete
  2. simply superb wordings!!! the comparision of love with nature is exhilarating....too good! this is 'jo'

    ReplyDelete
  3. అందుకే.....భర్త అన్నారేమో...
    ఇన్నీ భరించినా....వార్ధక్యంలో...
    భగవంతుని వరంతో..(అదే మరపపు)జీవించు.
    తేనె లేని గూడుగా.

    ReplyDelete