Saturday, April 25, 2009

చిన్న సహాయం చేయగలరా....

రోజు మిట్ట మద్యాహ్నం పని ఉండి బయటకి వెళ్లాను , సచివాలయం దగ్గర , ఫ్లయ్ఓవర్ కింద కొంతమంది చాలా దయనీయంగా కనిపించారు. కొంతమంది అలా దరిద్రంగా డెకరేట్ చేసుకుని అడుక్కుతినడం మనం చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తుంటాము, చిన్న పిల్లను చంకలో వేసుకుని ఏడుపు మొహంతో అడుక్కుతింటూ వుంటారు, వాళ్ళను చూస్తె అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది, వాళ్ళకి అదే మెయిన్ బిజినెస్ అని చూడగానే తెలిసిపోతుంది, కానీ నేను చెప్పేది వాళ్ల గురించి కాదు. వాళ నేను రెండు చేతులు భుజాలవరకు లేని ఒక ఆవిడ దయనీయంగా అడుక్కుటినడం చూసాను, అలాగే నడవడం కూడా చేతకాని ఒక పండు ముసలి వాణ్ణీ చూసాను, ఇంకా ఇలాంటి వాళ్లు ఎంతమంది కనిపిస్తారో అని అదేపనిగా గమనించడం మొదలుపెడితే కనిపించిన ఒక వ్యక్తి నన్ను ఇది రాయడానికి కదిలేలా చేసింది. ఆమెదొక దయనీయ పరిస్థితి అని చెప్పొచ్చు, ఆమె ఒక మతిస్థిమితం లేని ఒక మహిళ, వయసు ఒక పాతిక ఉండొచ్చు. ఒంటిమీద బట్టలు కూడా సరిగా లేవు , తనేం చేస్తుందో తనకే తెలియని పరిస్తితి , అలాంటి మహిళకు భద్రత వుంటుందా? ఆమెకి రోజు ఎలాగడుస్తుంది? ఇలాంటి ప్రశ్నలు నన్ను మనఃశ్శాంతి గా వుండనివ్వలేదు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి ఏవైనా సేవా సంఘాలు ఉన్నాయా?వారికి సమాచారం అందిస్తే ఇలాంటి వారిని అక్కున చేర్చుంటారు కదా? మీ దగ్గర ఇలాంటి సేవా సంఘాల వారిగురించి ఏమైనా సమాచారం ఉంటే వారి అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియచేయగలరు, నేను కూడా ప్రయత్నిస్తాను. ఇదే నేనడిగిన చిన్న సహాయం , చేస్తారు కదూ? మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

No comments:

Post a Comment