Saturday, April 17, 2010

ఆదుకోండి

ఎండలు ఎంత తీవ్రంగా వున్నాయో నేను చెప్పనక్ఖర్లేదు, నేనే కాదు ఎవరైనా ఎండలకు చల్లటి పానీయాలు తాగాలనుకోవడం లో ఆచ్యర్యం లేదు, నేనైతే కూల్ డ్రింక్స్ , మజ్జిగ, జూసుఅంటూ చల్లటి ద్రవ పదార్థాలు తీస్కోకుండా ఉండలేను; ఇక నీటి గురించి చెప్పనక్ఖర్లేదు ఎన్ని గ్లాసులు తాగినా దాహం తీరదు. ఇలా ఎన్నో రకాలుగా దాహం తీర్చుకోవడానికి డబ్బుని, సమయాన్ని ఖర్చు చేయడం లో మాత్రం వెనుకాడను, నాలా చాలా మంది చేస్తుంటారు.... అంతే కాదండోయ్ నా పక్కనున్న వారికి అదేనండి స్నేహితులకి ఇంట్లోవారికి కూడా ఖర్చు పెట్టి శీతల పానీయాలు పట్టుకేల్తాను, మరి ఏం చేద్దాం చెప్పండి సూర్య భగవానుడి ప్రతాపం అలాంటిది. ఇదంతా సరే కాని మనకైతే మండుతున్న ఎండ నుండి కాపాడుకోవడానికి చాల ఏర్పాట్లు చేసుకుంటాం, కాని ఇవేవి చేతకాని, అభం శుభం తెలియని చిన్న చిన్న ప్రాణులు, పక్షులు కాలం లో కనీసం తాగడానికి గుక్కెడు నీరు లేక ప్రాణాలు ఒదులుతున్నాయంటే మీరు నమ్మగలరా? కాని ఇదే నిజం.. ఇది వినడానికే మనసు బాధగా వుంది కదా..? ఇదెంత దయనీయమైన పరిస్థితి ఒక ప్రాణం ఖరీదు గుక్కెడు నీళ్ళంటే దాన్ని నిలబెట్టడం మనకు అసాధ్యం కాదు కదా? మనసున్న ప్రతి ఒక్కరు ప్రతి రోజు ఒక చిన్న పని చేసి ఇలాంటి చిన్న చిన్న ప్రాణులు బ్రతకడానికి ఆధారమవ్వండి; అందుకు పెద్దగా శ్రమించవలసిన పని లేదు రోజు లో మీకు వీలున్న సమయం లో కాస్త వీటికి నీరందించే ప్రయత్నం చేయండి...కాదు..కాదు... ప్రాణం అందించే ప్రయత్నం చేయండి. అందుకు మీ ఇంటి దగ్గర ఖాళీ స్థలం లో ఒక తొట్టి లో కాని పగిలిన కుండలో కాని నీటిని పెట్టండి చాలు ఎన్నో ప్రాణులకు ప్రాణం పోసిన వారవుతారు. పల్లెల్లో కంటే పెద్ద పెద్ద నగరాల్లో నీరు దొరకడం చాలా ఖష్టం కాబట్టి శ్రమ లేని ఒక మంచి పని లో మనమందరం పాల్గొని కొన్ని ప్రాణాలైనా నిలబెట్టడానికి ప్రయత్నం చేద్దాం. చేస్తారనే ఆశిస్తున్నాను.....