Thursday, April 23, 2009

మీరు ఒప్పుకుంటారా?

మనకున్న మూఢ నమ్మకాల్లో 'విగ్రహారాధన', కే అగ్ర తాంబూలం అని నేననుకుంటున్నాను మీరేమంటారు?
అవును ఐతే ఎందుకు?
కాదు ఐతే ఎందుకు?

8 comments:

  1. విగ్రహారాధన మూడ నమ్మకం అయితే అది చేసేవారంతా మూడులు అయితే ఆ మూడులలో నేనున్నందుకు గర్విస్తున్నాను. అలా మీరు దానికే అగ్ర తాంబూలం ఇచ్చేస్తున్నరు కనుక 'గురూగారూ' ఆ తాంబూలం గట్రాలేమైనా ఉంటే తొందరగా పంపించేయండి.

    ReplyDelete
  2. విశ్వనాధ్ గారూ రిప్లై ఇచ్చినందుకు ధన్యవాదములు, ఇది రాయడానికి ముందు మీ అక్షర, చిన్నారి బ్లాగ్ లను చూసి, నేనుమీకన్నా అనుభవంలోనూ, వయసులోనూ చిన్నవాడినని నిర్ణయించుకున్నాను. ఎందుకంటే మీరు నన్ను 'గురూగారూ' అని సంభోదించారు. ఏం లేదండీ నాకొచ్చిన చిన్న సందేహమే ఈ వ్యాఖ్య, భగవంతుడు 'సర్వాంతర్యామి' అని నేనునమ్మడం వల్ల కలిగిన సందేహమే మీ ముందుంచాను. భగవంతుడు 'సర్వాంతర్యామి' ఐనప్పుడు , విగ్రహాన్ని దేవుడనిపూజించడం లో అర్థం లేదు అని నా అభిప్రాయం. ఎవరినీ కించపరిచే ఉద్ద్యేశ్యం నాకు లేదండి.

    ReplyDelete
  3. "భగవంతుడు 'సర్వాంతర్యామి' ఐనప్పుడు , విగ్రహాన్ని దేవుడనిపూజించడం లో అర్థం లేదు అని నా అభిప్రాయం. ఎవరినీ కించపరిచే ఉద్ద్యేశ్యం నాకు లేదండి."

    భగవంతుడు సర్వాంతర్యామి అయినప్పుడు, విగ్రహాల్లో మాత్రం దేవుడు ఉండటడండి? :)

    ReplyDelete
  4. యోగి గారూ, మీరన్నది నిజమేనండి. భావంతుడు 'సర్వాంతర్యామి' ఐనప్పుడు, " విగ్రహాలలో కూడా దేవుడున్నాడు అని చెప్పడం వేరు, విగ్రహాలే దేవుళ్ళు అని చెప్పడం వేరు". రెండింటికీ చాల తేడా వుండి కదండీ.

    ReplyDelete
  5. ముస్లింలు విగ్రహారాధన చెయ్యరు. మరి వాళ్ళలో కూడా అనేక మూఢ నమ్మకాలు ఉన్నాయి కదా.

    ReplyDelete
  6. ప్రవీణ్ గారూ మీరు చెప్పింది నిజమే,ఖచ్చితంగా వున్నాయి. నేను 'విగ్రహారాధన' గురించి చెప్పాను, మీరు విగ్రహారాధన చేసేవారు, లేక చేయనివారి గురించో చెప్తున్నారు.

    ReplyDelete
  7. కాదు అని నా అభిప్రాయం .అయినా మాయచేసి మోసగించే బాబాలను , అమ్మలను నమ్మటం కంటే విగ్రహారాధన నిరపాయకరమైనదీ ...ఆరోగ్యకరమైనదీ అనుకొంటున్నాను .అగ్ర తాంబూలానికి అర్హమైనవి వేరే
    చాలా ఉండి ఉంటాయి .

    ReplyDelete
  8. పరిమళం గారు , విగ్రహారాధన నే నేను మూఢ నమ్మకంగా భావిస్తున్నప్పుడు ఈ దొంగ బాబా లను ఎలా ఒప్పుకుంటాను చెప్పండి ? అస్సలు విగ్రహారాధన గురించి అలా ఎలా అనుకున్నానో? వాటి వివరాలు త్వరలో మరొక పోస్ట్ లో రాయాలనుకుంటున్నాను అప్పుడు కూడా మీ అభిప్రాయాలు చాల అవసరం. ఇదంతా నా సందేహ నివృత్తి కే తప్ప ఇంకోటి కాదని గ్రహించగలరు. మీ స్పందనకు ధన్యవాదములు.

    ReplyDelete