Monday, April 6, 2009

మీవాడు చాలా తెలివైనోడు...

అప్పుడు నేను ఒకటో,రెండో చదువుతున్నా మాది చిన్న పల్లె. మా ఇంటిపక్కన ఒకావిడ రోజూ ఏదో వంకతో అవి , ఇవి పట్టుకేల్లేది ఒకరోజు కాఫీ పొడి , ఇంకోరోజు చక్కర ,కంది పప్పు ఇలా ఏదో ఒకటి. మా అమ్మకు వుసుగేత్తిపోయి ఇక ఇవ్వకూడదు ఏదో ఒకటి చెయ్యాలి అని అనుకుంది. ఇంతలొ ఆవిడ రానే వచ్చింది ఈసారి వుల్లిపాయలకు టెండర్ వేసిందని పసిగట్టిన అమ్మ ఐపోయానురా అనుకుంది ఎందుకంటే అప్పుడు ధర విపరీతంగా పెరిగిపోయింది. "మా ఇంట్లో కూడా ఐపోయాయి తేవాలి" అని చెప్పింది అమ్మా ఆవిడతో . అందుకు ఆవిడ "మరి చీకటిపడింది ఇప్పుడు వంటకి కావాలంటే ఎలా?" అంది . అందుకు అమ్మ "అదే ఆలోచిస్తున్నాను ఏం చేయాలా అని?" ఇంతలో పక్కనే వున్న నాకు "ఇంట్లో వుల్లిపాయలు వున్నాయి కదా! పాపం అమ్మ చూసుకున్నట్టు లేదు, అందుకే ఇంక వంట చేయలేదేమో గుర్తుచేద్దాం" అని "అమ్మా, నేను చూసాను వంటింట్లో వుల్లిపాయలు నేను చూసాను..... " అన్నాను. ఆవిడ మా అమ్మా మొహం వైపు చూసింది , పాపం మా అమ్మా ఏదో కవర్ చేయడానికి " అవునురా మర్చిపోయా నాలుగు వుల్లుపాయలుండాలి ఇందాక కనపడలేదు" అంది. ఇంతలో ఆవిడ అందుకుని "నాకు ఒకటి చాల్లే అమ్మాయి సర్దుకుంటాను అంది". ఆవిడ ఇచ్చేదాక వదలడు అని డిసైడ్ అయ్యి " ఒక్క దానితో ఎలాగా లే పిన్ని..." అని నా వైపు తిరిగి " ఆంటీ కి రెండు వుల్లిపాలు తెచ్చి ఇవ్వమంది" నేను అలాగే చేశాను. అందుకు ఆవిడ " మీ పిల్లోడు చాల శానోడే(తెలివైన వాడే) రెండంటే ,రెండే ఇచ్చాడు" అంది. అది విని మా అమ్మా గర్వంగా ఫీల్ అయ్యి "శభాష్" అన్నట్టు నా వైపు చూసింది. ఆవిడ నన్ను పోగిడిందో లేక తిట్టిందో అర్తం అవ్వక తిట్టింది అని డిసైడ్ అయ్యి కోపం తో "...నేనేం శానోడెం కాదు...వుండు వస్తా అని చెప్పి" లోపలికెళ్ళి చేటలో కొన్ని వుల్లిపాయాలు తెచ్చాను . కొన్ని అంటే ఎన్ని అనేగా మీ అనుమానం "అన్నీ"...... ఆవిడ అన్ని వొడి లో వేసుకుని ఆనందంగా వెళ్ళిపోయింది . తర్వాత ఎం జరిగుంటుందో మీరే వూహించండి...... అదే తీపి జ్ఞాపకం.

5 comments:

  1. intha telivini ela bharisthunnarandi babu

    ReplyDelete
  2. శ్రవ్య గారు అది చిన్నప్పుడు కదండీ అంత తెలివి వుండేది........ ఇప్పుడు కొంచెం పరవా లేదు లెండి.

    ReplyDelete
  3. కార్తిక, కొత్తపాళీ గారికి....సంతోషంగా నవ్వినందుకు....హహహః.

    ReplyDelete