Tuesday, April 21, 2009

పరుగు

ఒకరోజు ఉదయం ఒక అడవిలో ఒక లేడి నిద్రలేవగానే ఆకలిగా ఉన్న పులిని చూసింది, ఇంతలొ పులి కూడా లేడిని చూసింది. ఇప్పుడా పులి లేడిని వేటాడి తినకపోతే ఆకలితో చనిపోవడం ఖాయం, పులికి దొరికిందంటే లేడి చనిపోవడం ఖాయం. ఆహారం కోసం పులి,ప్రాణం కోసం లేడి పరుగెత్తడం ప్రారంభించాయి. లేడికన్నా వేగంగా పరుగెత్తి దాన్ని పట్టుకోవాలని పులి, పులికన్నా వేగంగా పరుగెత్తి ప్రాణాలు కాపాడుకోవాలి లేడి. ఇలా రెండింటికీ పరుగు తప్పదు. మన జీవితం కూడా ఇంతే నీ స్థానం పులి కావచ్చు లేదా లేడివి కావచ్చు ఏది ఏమయినప్పటికీ బ్రతకడానికి పరుగు తప్పనిసరి ఎప్పుడైనా పరుగెత్తడానికి నువ్వు సదా సిధ్ధంగా వుండాలి.

No comments:

Post a Comment