Wednesday, August 24, 2011

ఆత్యాద్మిక సందేహం......

రాముడు, కృష్ణుడు... ఇంకా చాలా మంది ఐతిహాసికులను మనం దేవుళ్ళు గా పూజిస్తున్నాం కదా! అంతకు మునుపు అంటే రాముడి తండ్రి ఐన దశరథుడు ఎవరిని పూజించేవారు? అంతకు మునుపు కూడా భగవంతుడు వున్నాడు కదా? మనం  అందరం భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్ముతాం, అందులో ఏ సందేహం లేదు. అంటే అంతటా వ్యాపించిన వాడు అని, అది ఆయన గుణం, అలాంటప్పుడు అవతరిచడం అంటే భగవంతుడు సర్వ వ్యాప్తిత్వాన్ని వదలి ఒక శరీరాన్ని ధరించడం; ఇలా జరిగినట్లయితే భగవంతుడు ఆయన గుణాన్ని వదిలివేయడమే అని స్పష్టం అవుతుంది. ఆ గుణం కోల్పోయిన దేన్నైనా కూడా భగవంతుడు అనడం తప్పు కదా! ఆయన భూమి మిద పుట్టిన ఉత్తమ పురుషుడిగా భావించడం, అనుసరించి గొప్ప వ్యక్తిత్వాన్ని పొందడం శ్రేయస్కరం కానీ భగవంతుడు అనుకోవడం లోనే నా సందేహం. మీ సమాధానాల వల్ల నా సందేహం నివృత్తి అవగలదు అని ఆశిస్తున్నాను. అని ఒక సందేహం పోస్ట్ చేస్తే దుర్గేశ్వర గారి దగ్గరనుంచి  కింది జవాబు వచ్చింది 

durgeswara said...
సర్వాంతర్యామిఅని మీరు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన ఒకచోట లేడని చెప్పలేంకదా . కొత్తగాపుట్టటం కాదు అక్కడవ్యక్తమయ్యాడని అనుకోవచ్చుకదా. అంటే అక్కడున్నసంగతి మనకు ఇప్పుడే తెలిసిఉండవచ్చు కదా ? ఇక్కడ మీ భావం అర్ధమవుతున్నది . నేను ఇప్పుడు పదవతరగతి పాఠాలు చెప్పేప్పుడు నాసబ్జక్ట్ గూర్చి తెలిసిన మీరు మరలా అవసరమై ఒకటవతరగతి పాఠాలు చెప్పేప్పుడు నాకు అంకెలు ఎక్కాలే వచ్చు ఆల్జీబ్రారాదనుకోవచ్చా ? అలాగే పరమాత్మ ప్రాథమిక స్థాయిలో మానవులకు అందుబాటులోకొచ్చినందుకు మనం ఆయన సర్వవ్యాపకత్వాన్ని తక్కువగా నిర్ణయించుకోరాదు. మనచుట్టూ గాలి ఉంటుంది. కానీ అది మన వాహనంటైర్లోకి అది నేరుగా ఎక్కదు కదా ? దానికొ పంప్ అనే పరికరం కావాలి.అలాగే అనంతగుణసంపన్నుడైన ఆయన తత్వాన్ని మనం అవగాహన చేసుకోవటం కోసం అపారకరుణతో ఆయన మనదగ్గరకే వచ్చిన లీలా విశేషాలను అమాయకత్వంతో తిక్కతర్కాలతో అనుభవానికి తీసుకునే అదృష్టం కోల్పోరాదు మనం."     కాని ఈ సమాధానం నాకు తృప్తిని ఇవ్వలేదు అందుకే నేను నా సంధిగ్ధాన్ని ఇలా విన్నవించుకున్నాను.   "దుర్గేశ్వర గారు ముందుగా నమస్కారమండి మీ 'హరి సేవ', 'దైవ లీలలు' చూసాను చాలా బాగున్నాయి. ఇక మీరిచ్చిన సమాధానం లో "మనచుట్టూ గాలి ఉంటుంది. కానీ అది మన వాహనంటైర్లోకి అది నేరుగా ఎక్కదు కదా ? దానికొ పంప్ అనే పరికరం కావాలి." అని కదా, కానీ వాహనం టైర్ లో ఇదివరకు గాలి లేదు మరియు స్వతహా గ టైర్ లోకి వెళ్ళలేదు కాబట్టి పంప్ అనే పరికరం కావాలి, కానీ భగవంతుడి విషయం అలా కాదు ఆయన సర్వాంతర్యామి ఆయని జ్ఞానం అనంతం సంకల్ప మాత్రం చేత శ్రుష్టి చేసిన ఆయన ఒక చిన్న కార్యం చేయడానికి మానవ రూపం లో పుట్టవలసిన ఆవశ్యకత ఏమిటి? ఒక సారి ఆలోచించండి."    పెద్దలకు నా విన్నపం నా సందేహ నివృత్తి కి సహకరించి మీ అమూల్యమైన సమాధానాలతో చర్చ కొనసాగించాలని ఆశిస్తున్నాను.

Tuesday, August 23, 2011

పుట్టిన రోజు శుభాకాంక్షలు


నా లో సగమైన నీకు నేనందిస్తున్నజన్మ దిన శుభాకాంక్షలు.
నువ్వు ఇలాగె వంద వసంతాలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఇలాంటి పుట్టిన రోజులు జరుపుకోవాలని మనఃస్పూర్తిగా కోరుకుంటూ....... 
నీ నేను.

Sunday, August 21, 2011

ఆత్యాద్మిక సందేహం......

రాముడు, కృష్ణుడు... ఇంకా చాలా మంది ఐతిహాసికులను మనం దేవుళ్ళు గా పూజిస్తున్నాం కదా! అంతకు మునుపు అంటే రాముడి తండ్రి ఐన దశరథుడు ఎవరిని పూజించేవారు? అంతకు మునుపు కూడా భగవంతుడు వున్నాడు కదా? మనం  అందరం భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్ముతాం, అందులో ఏ సందేహం లేదు. అంటే అంతటా వ్యాపించిన వాడు అని, అది ఆయన గుణం, అలాంటప్పుడు అవతరిచడం అంటే భగవంతుడు సర్వ వ్యాప్తిత్వాన్ని వదలి ఒక శరీరాన్ని ధరించడం; ఇలా జరిగినట్లయితే భగవంతుడు ఆయన గుణాన్ని వదిలివేయడమే అని స్పష్టం అవుతుంది. ఆ గుణం కోల్పోయిన దేన్నైనా కూడా భగవంతుడు అనడం తప్పు కదా! ఆయన భూమి మిద పుట్టిన ఉత్తమ పురుషుడిగా భావించడం, అనుసరించి గొప్ప వ్యక్తిత్వాన్ని పొందడం శ్రేయస్కరం కానీ భగవంతుడు అనుకోవడం లోనే నా సందేహం. మీ సమాధానాల వల్ల నా సందేహం నివృత్తి అవగలదు అని ఆశిస్తున్నాను.




మరికొన్ని అపురూపాలు

ఒక దేవాలయం - 1880


పాలెస్ ఆఫ్ ఓర్చా - 1882

జహంగీర్ మందిర్ పాలెస్ - ఓర్చా



 ఫలక్ నుమ పాలెస్

గేట్ వే - వరంగల్

గేట్ వే - వరంగల్

Saturday, August 20, 2011

సరదాగా ఒక కామెంట్ ప్లీజ్.....

ఈ పిల్లులను చూస్తే మికేమనిపిస్తుందో 
సరదాగా ఒక కామెంట్ ప్లీజ్.....

అల నాటి అందాలు మరి కొన్ని

 అహమ్మద్ షా నాణేలు 1450

స్వామీ వివేకానంద 

లక్నో కి చెందిన నాట్య గత్తె - 1890

  అల నాటి రాజ వశీకులు

అజంతా గుహలు 

ఆనంద రావు పవార్, మహా రాజా అఫ్ షార్

 ఆర్మీ గ్రౌండ్స్  సికింద్రాబాద్ - 1890

ఆసుఫ్ గుంజ - గుల్బర్గా , 1880s

బషీర్ బాఘ్ పాలస్


హైదరాబద్ ప్రధాన అంగడి సముదాయము 

చిమన భాయి టవర్ - బరోడా

Saturday, August 6, 2011

స్నేహానికి ఒకరోజేన.....?

స్నేహానికి ఒక రోజు కేటాయించ వలసిన ఆవశ్యకత ఏంటో తెలియదు మరి? అది పవిత్రం, నిత్యమూ. అది లేని సమాజం అంటూ వుండదు, అది ఒక అనుభూతి, మనిషి కి మనిషి కి మధ్య మనసు వేసిన వారధి. మనిషి పుట్టినప్పుడు పుట్టిన ఆ అనుభూతి, భూమి పైన మనిషి మనుగడ ఉన్నంత వరకు సాగుతుంది. పవిత్రమైన స్నేహాన్ని మనం మనకు తెలియకుండానే అనునిత్యం గౌరవిస్తున్నాం. అలాంటిది దానికంటూ ప్రత్యేకంగా కేవలం ఒక రోజుని కేటాయించడం ఆమోదయోగ్యం కాదు. దేన్నైనా సరైన అవగాహనా లేకుండా గుడ్డిగా అనుసరించడం అంటే, మన విలువలను మనమే అవమానించడం.

చివరిగా ఒక వినతి, ఇది నా మనసు నాకు చెప్పిన మాటగా మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను.
ఇది ఎవరిని ఆక్షేపించినట్టు కాదు.
ఇతరులకి ఇబ్బంది కలగనంతవరకు, ఎవరికి నచినట్టు వాళ్ళు వుండే హక్కు అందరికి వుంటుంది.

ఇది చూసి వీడు 'నలుగురికి.. నచ్చినది.. నాకసలే ఇక నచ్చదు లే..' టైపు అనుకుంటే ఎక్కడో కాలేసినట్టే... నేనూ మీలాగే ఐనా, మనసు కి అనిపించింది మాత్రం  ఇలా బయట పెట్టే టైపు. నలుగురూ నవ్వుతూ వున్నపుడు నేను మాత్రమే  ఏడిస్తే ఏం బాగుంటుంది... కానీ నేను( నా బుద్ధి) చెప్పింది తప్పు కాదు కదా?  ఏమంటారు...
నాకూ  friendship day wishes చెప్ప వచ్చండి.

మీ,
ఓమ్ ప్రకాశార్య



Thursday, June 16, 2011

మన్నించు


నేను తెలిసి కొన్ని, తెలియక కొన్ని చాల తప్పులు చేసాను..... అంగీకరిస్తున్నాను.
కానీ ఒక్కటి మాత్రం నిజం; ఆ తప్పుల వల్ల ఎవరు ఇబ్బంది పడలేదు. ఐనా నా మనసు ఒప్పుకోవడం లేదు.
ఆ భగవంతున్ని ఒకటే కోరుకుంటున్నాను........
సర్వాంతర్యామి అయిన ఓ భగవంతుడా 
అన్నింటా నువ్వున్నావని నమ్ముతున్నాను
నా లో కూడా వున్నావు; మరి నా మనసెందుకు అదుపులో లేదు?
నువ్వున్న చోట తప్పు జరగకూడదు కదా?
అంటే ఖర్మ కి నువ్వు భాద్యుడివి కావు; ఎవరికి వారే వారి బుద్ధి ని అనుసరించి జ్ఞానాన్ని పొందాలని,
చేసిన ఖర్మ ఫలాని అనుభవించాలని అర్థమైంది.
అయితే ఒక విన్నపం; నాకు మనసుని జయించనవసరం లేదు కానీ అదుపులో పెట్టుకునే శక్తిని ఇవ్వు.

చదివిన పెద్దలకి విన్నపం; మనసుని అదుపులో పెట్టె మార్గం ఏదైనా వుంటే విశదీకరించండి. నాకే కాదు,
అవసరమనుకున్న ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు కదా. మీ మాట ఒక మంచి మార్గం కావొచ్చు.
శుభోదయం.

 మీ ఓమ్ ప్రకశార్య.











Wednesday, June 15, 2011

శుభోదయం

అందరికి శుభోదయం ఈ ఉదయం మొదలు ప్రతి దినం అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కుటుంభం అంతా నవ్వుల వనంగా చల్లని మంచుకొండలో వేసవి విడిది లా నవ్వుతూ బతకాలని కోరుకుంటూ

మీ
ఓమ్ ప్రకాష్ ఆర్య