Wednesday, April 22, 2009

ఇప్పటికీ బాధ పెడుతుంది......

ఒక రోజు అమీర్ పేట లో బస్ కోసం చూస్తున్నాను, కోటి కి వెళ్ళాలి, బస్ వచ్చింది బ్యాక్ సైడ్ ఫాస్ట్ గా ఎక్కబోయాను, ఇంతలొ బస్ నుండి ఐదుగురు హడావిడిగా దిగాబోయారు,వాళ్ళని చూసి నేనే దారిచ్చాను, తర్వాత బస్ ఎక్కి సీట్ కోసంవెతుకుతుంటే, ఒక పెద్దమనిషి వయసు సుమారు అరవై వుంటాయి, వున్నట్టుంది కింద నిస్సహాయంగాకూర్చుండిపోయాడు , మొహమంతా చమటలు, కళ్ళలో నీళ్లు, అరవలేక నోట మాట రాక , ఏదో అంటున్నాడు. నేనేమోమొదట హార్ట్ ఎటాక్ ఏమో అనుకున్నా,చెయ్యి పట్టుకుని పైకి లేపి ఏమైందని అడిగితే, చెప్పాడు తన దగ్గర నలభై వేలుపోయాయని. వివరంగా" పెద్దాయన అప్పుడే బ్యాంకు నుంచి డెబ్భై వేలు డ్రా చేసి ముప్పై వేలు ఒకవైపు, నలభై వేలుఒకవైపు నడుముకి అటు,ఇటు చేతిరుమాల్లతో కట్టుకుని బస్ ఎక్కాడు, అది గమనించిన ఐదు మంది దొంగ వెధవలుఆయననే అనుసరించి ఆయన్తోపాటే బస్ ఎక్కేసారు, పెద్దాయనకు సీట్ దొరకక నిల్చుంటే ,వీళ్ళు కూడా ప్రయానికుల్లాఆయనచుట్టు అనుమానం రాకుండా నిలబడి అదనుకోసం ఎదురు చూస్తున్నారు, ఇంతలొ బస్ స్టాప్ వచ్చేసరికిపెద్దాయన్ని కూడా తోసుకుంటూ బ్యాక్ డోర్ దగ్గరగా తీసుకువచ్చారు ,డోర్ రాగానే వాళ్ళలో కొంతమంది ప్రయాణికులకుకనపడకుండా చుట్టూ నిలబడగా మిగిలినవారు నలబై వేల కట్టను చాకచక్యంగా కొట్టేసి ఆలస్యం చేయకుండా పరుగుపరుగున దిగాబోయారు" అప్పుడే బస్ లోకి వస్తున్న నేను పాపం దిగే ప్రయాణికులు అనుకుని దారిచ్చను. పాపం పెద్దాయన అవసరం కోసం,ఎంత ఖష్టపడి ఎన్ని సంవత్సరాలనుండి కూడబెట్టుకున్నాడో డబ్బుని దొంగ వెధవలు ఒక్క పదినిముషాలలో దోచుకుపోయారు. అపుడు నాకు మా నాన్న గుర్తుకొచ్చాడు. మధ్యతరగతి కుటుంభం లో కుటుంభ పెద్ద ఒక్కొక్క పైసా కూడా అపురూపంగా దాచుకుంటాడు అవసరం అలాంటిది. డబ్బు కూతురు పెళ్ళికేకావచ్చు, ఎవరికయినా ఆపరేషన్ కి కావచ్చు, పిల్లల చదువుకి కావచ్చు, ఇవన్నీ దొంగ వెధవలకి అర్థం కాదు. వాళ్ళకికూడా అర్థమయ్యి మారాలని అనుకోవడం అత్యాశే ఐన అందులో ఒక్కడైనా అలోచించి తిరిగి డబ్బిచ్చేస్తే బాగుండునుఅనుకున్నాను. పాపం పెద్దాయన ఏడుస్తూ బస్ దిగి వాళ్ళకోసం పరుగెత్తిన దృశ్యం ఇప్పటికి నన్ను బాధ పెడుతూనేవుంటుంది ఎందుకంటే వెధవలకి నేనే దారిచ్చనే , ఒక్కడినైనా పట్టుకునే వీలుంది, కాని నేనేం చేయలేదే అని , నాకువాళ్లు దొంగలని తెలియకపోవచ్చు ,ఐనప్పటికీ నాకు బాధగానే వుంటుంది. అలాంటి వాళ్లు మార్చాలనుకోవడం కంటే మనంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం మనవి. పెద్దాయన దొంగతనం జరిగిందని తెలియగానే షాక్ లో వుండిపోకుండాతేరుకుని గట్టిగ అరవడం లాంటివి చేసుంటే దొంగలు దొరికేవారేమో కదా , నాలాంటి వాడుకనీసం పట్టుకోవడానికి ప్రయత్నంచేసేవాడు కదా. ఏది ఏమైనా మన జాగ్రత్తల్లో మనం వుండడం మంచిది కదా, అంతే కాదు అలాంటి సమయాల్లోభయపడకుండా సమస్పూర్తిగా వ్యవహరించడం కూడా మన పనే. అలాంటి సమయాల్లో ఎవరినైనా సహాయంఅడగడానికి వెనుకాడవద్దు. పోయిన తర్వాత ఏడవడం ఒకటే మిగులుతుంది కదా .

3 comments:

  1. పెద్దాయన చెప్పిఉంటే మీరు ఏమైనా చేసి ఉండేవారేమో, మీరన్నట్టు అందరూ మనుషులేకదా వాళ్ళల్లో ఒక్కరైనా ఆలోచించి ఉంటే ఎంతబాగుండేది.కాని అయిపొయిన తర్వాత ఏమిచేస్తాం చెప్పండి.మన జాగ్రత్తలో మనం ఉండాలి.

    ReplyDelete
  2. మా పెళ్ళి బట్టలకోసం వెళ్తుంటే మా తాతయ్య దగ్గర కూడా అలాగే డబ్బులు కొట్టేశారు.చార్జీలకు కూడా ఇబ్బంది పడి వెనక్కొచ్చి డబ్బు తీసుకుని మళ్ళీ వెళ్ళారు.

    ReplyDelete
  3. మారుతి గారు, విజయమోహన్ గారు ఇలాంటివి వింటే భాధగా వుంటుందండీ, కానే మనమే సమయస్ఫూర్తి తో నడచుకోవాలి.

    ReplyDelete