Saturday, April 25, 2009

కుటుంబం లో వచ్చిన(తెచ్చిన) మార్పు...

నా స్నేహితుడు సురేంద్ర , బాగా డబ్బు, పరపతి వున్న కుటుంబం , ఇంట్లో అందరూ మాంసాహారులే, ఎంతంటే...దాంతో ఊరగాయ పెట్టి మరీ సంవత్సరమంతా తింటారు. అంతిష్టం వాళ్ళకి మాంసాహారమంటే, ఇక ఊళ్ళో జాతర లాంటివి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, మరుసటిరోజు యాట తెగాల్సిందే, దాన్నే కరి అంటారు మావైపు. మాది రాయలసీమ లెండి. మొన్నొకసారి నన్ను వాళ్ల ఊరికి రమ్మని పిలిచాడు, ఎంట్రా ఏమైనా విశేషమా? ఇంకేం ఇంట్లో ఓన్లీ నాన్ వెజ్ ఏమో కదా? నేనొస్తే నాకోసం వెజ్ ఐటమ్స్ చేయాలి అప్పుడు డబల్ పని కదర అమ్మ వాళ్ళకి వద్దులే అన్నాను. ఎందుకంటే నేను శాకాహారి ని లెండి. అప్పుడు వాడు" మా ఇంట్లో ఇప్పుడు అందరూ మాంసాహారం మానేశారు,నీతోపాటే అందరూ నువ్వు హ్యాపీ రావచ్చు" ఆనాడు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసి అడిగా అప్పుడు వాడు చెప్పిన విషయం నాకు బాగా నచ్చి ఇక్కడ రాస్తున్నాను. ఒకరోజు మా సూరి వాళ్ల నాన్న కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు, రోడ్ పైన జైనమత సన్యాశినులు నడుచుకుంటూ వెళ్తున్నారు, అందులో ఒక వయసెక్కువగా ఉన్న, నడవలేని ఒక ఆమెని ఒక సన్యాశిని వీల్ చైర్ లో తోసుకుంటూ తీసుకెల్తోంది. ఇంతలొ అనుకోకుండా ఆయన డ్రైవ్ చేస్తున్న కార్ అదుపుతప్పి ముసలామెని, వీల్ చైర్ తోసుకేల్తున్న సన్యాశిని ని తగిలే సరికి ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి. యన భయపడి ఏమైందో అని దగ్గరికెళ్ళి చూసాడు, పరిస్తితి కొంచెం సీరియస్ గానే అనిపించింది. ఇంతలొ అక్కడుండే వారంతాకోపంగా వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నారు. ఆయన కి భయం వేసి " అమ్మ ఇప్పుడవేన్నీ ఎందుకు ముందు హాస్పిటల్ కి వెళదాం ఆమె కి ఏమీ కాదు, ఎంత ఖర్చైనా అంతా నేనే భరిస్తా" అని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఏమో, "మేము కూడా అలా మాట్లాడి వుండకూడదు, మాకు ఏమీ వద్దు నువ్వు మాకు ఒక మాట ఇవ్వు చాలు" అన్నారు. అదేంటంటే "ఇప్పటి నుండి మీరు మాంసాహారం తినడం మానేయాలి" అని. అలాగే ఆయన మాటిచ్చారు, ఇప్పటికీ మాట మీదే నిలబడ్డారు. అంతే కాదండీ ఇప్పుడు వాళ్ళింట్లో ఎవరూ మాంసాహారం ముట్టుకోవట్లేదు . ఏమీ ఆశించకుండా ఒక మంచి పనిని ఇంకొకరిచేత చేఇంచాలనుకోవడం వారి గొప్పతనమైతే, ఇచ్చినమాటకి కట్టుబడి మాటనిలబెట్టుకుంటున్న కుటుంబానిదీ గొప్పతనమే. అందుకే మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

9 comments:

  1. మాంసాహారాన్ని తినేవాళ్ళు మానివేస్తే నూరు యజ్ఞాలు చేసినంత పుణ్యమని అంటారు పెద్దలు.మాట నిలబెట్టుకునేవాళ్ళు గొప్పవాళ్ళు.

    ReplyDelete
  2. Sytax error... కుటుంబం అనే పదంలో "భ" ఉండదు, "బ" ఉంటుంది. I am also pure vegetarian. I don't touch chicken and mutton but I eat eggs.

    ReplyDelete
  3. పరిమళం గారు, చిలమకూరు విజయమోహన్ గారు, మీ స్పందనకు ధన్యవాదములు. అవునండీ మాట నిలబెట్టుకునేవారు నిజంగా గొప్పవారే.

    ReplyDelete
  4. ప్యూర్ వెజిటేరియనిజం విషయంలో కబుర్లు చెప్పేవాళ్ళు ఎక్కువ, మాట నిలబెట్టుకునేవాళ్ళు తక్కువ.

    ReplyDelete
  5. ప్రవీణ్ గారు చాలా థాంక్స్ అండీ, ఇప్పుడే సరిచేసుకుంటాను. ముందు ముందు కూడా భాషా దోషాలేమైనా వుంటే చెప్పగలరని విన్నపము.

    ReplyDelete
  6. అదేంటండీ అంత మాటనేశారు? అసలు వెజిటేరియన్ లే తక్కువ వారిలో మాట నిలబెట్టుకునే వాళ్ళంటే!...... తక్కువే మరి

    ReplyDelete
  7. కొన్ని నెలల క్రితం నేను కూడా నావ్ వెజ్ తినేవాడిని. కేవలం నాలుక టేస్ట్ కోసం జంతువుల్ని చంపడం అనాగరికం అనిపించి నాన్ వెజ్ తినడం మానేశాను.

    A man can live and be healthy without killing animals for food; therefore, if he eats meat, he participates in taking animal life merely for the sake of his appetite. And to act so is immoral. - Leo Tolstoy

    ఈ వచనాలు గురించి నేను ఈ పేజి లో వ్రాశాను: http://telugu.stalin-mao.net/?p=140

    ReplyDelete
  8. anna e column non-veg's ni vegetarians laga marchetattu undi..baaboi...naaku vaddu e column

    ReplyDelete