Tuesday, April 7, 2009

తియ్యని చేదు....

రోజుల్లో ఇది తెలియని వారు వుండరు అంటే అతిశయోక్తి కాదు. అసలు డయాబెటిస్(చక్కర వ్యాధి) అంటే ఏంటో చూద్దాం . మన శరీరానికి పనిచేయడానికి శక్తి అవసరం, అది ఆహారం ద్వారా వస్తుంది. మనం రోజూ చాల పనులు చేస్తుంటాము, పని చేసినప్పుడంతా శక్తి అవసరమవుతుంది ,కాని అన్ని సార్లూ ఆహారం తీసుకోలేము కదా రోజుకి మూడు లేదా నాలుగు సార్లు తీసుకుంటాము. అలా తీసుకున్న ఆహారమే శక్తి అవసరమైనప్పుడంతా అందుబాటులోకి రావాలి. అందుకోసం ఓకే వ్యవస్థ మన శరీరం లో వుంది. వ్యవస్థ మనకు శక్తి అవసరం లేనప్పుడు దాన్ని కాలేయం లోనూ, కండరాల్లోనూ,కొవ్వుల రూపం లో నిల్వ చేస్తుంది. అవసరమైనప్పుడు బయటకు వచ్చి 'గ్లూకోస్' గా మారి వుపయోగపడుతుంది. ఇలా వీటిని కాలేయం లోనూ , కండరాల్లోనూ, కొవ్వుల రూపం లో నిల్వ వుంచడానికి,అలా నిల్వ వున్నా ఆహారానికి కాపలా గా 'ఇన్సులిన్' అనే హార్మోన్ పనిచేస్తుంది. ఇక నిల్వ వున్నా శక్తిని అవసరమైనప్పుడు బయటకు తీసుకు రావడానికి 'గ్లూకగాన్' అనే మరో హార్మోన్ పనిచేస్తుంది. మన శరీరానికి శక్తి అవసరమైన సమయం లో 'ఇన్సులిన్' తగ్గి 'గ్లూకగాన్' పెరుగుతుంది. 'గ్లూకగాన్' అవసరమైనప్పుడు 'గ్లూకోస్' ని బయటకు తేవడమే కాదు... అవసరమైతే 'గ్లూకోస్' ని తయారు కూడా చేస్తుంది. రెండు హోర్మోనే లు కూడా ఒక సమన్వయము తో పనిచేస్తుంటాయి. ఇప్పుడు ఆహారం నిల్వ చేస్తూ , దానికి తాళం లాగ పనిచేసే 'ఇన్సులిన్' హార్మోన్ లోపించింది అనుకుందాం ,లేక వుత్పత్తి తగ్గింది అనుకుందాం. అప్పుడు కాలేయం,కండరాలు,కొవ్వులు కాపలా లేని కారణంగా శక్తి 'గ్లూకోస్' గా మారి రక్తంలోనే వుండిపోతుంది. దీనినే 'ఇన్సులిన్ రెసిస్టన్స్' అంటారు. పరిస్థితినే 'డయాబెటిస్' అనుకోవచ్చు. మామూలుగా గ్లూకోస్ రక్తంలో వుంటే తప్పులేదు కాని దీర్ఘకాలం వుంటే... అది కళ్లు, గుండె, రక్త నాళాలు, మూత్రపిండాలు వంటి వాటిని దెబ్బ తిఇస్తుంది. డయాబెటిస్ గురించి తప్పక జాగ్రత్తలు తీసుకోవాలి.

No comments:

Post a Comment