Thursday, April 23, 2009

స్త్రీ లకు ప్రత్యేక బస్సుల అవసరం....

అవునండీ స్త్రీలకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు కావాలి, ముఖ్యంగా మన హైదరాబాదు లో, మన సిటీ బస్సుల్లో మహిళలు చాల ఇబ్బందులకు గురవుతున్నారు, బాగా నిండిన బస్సుల్లో ఎక్కాలంటేనే చాలా ఖష్టంగా వుంటుంది, అప్పటికే విసిగిపోయి వుంటారు, దానికి తోడు సీట్ వుండకపోతే నరకమే, పది,పదిహేను నుముషాలకి ఒక సిగ్నల్ లైట్, ఎక్కడ పడితే అక్కడ ఎక్కే పాసింజర్స్ తో బస్ జాతరలాగా వుంటుంది. విపరీతమైన చిరాకు, మధ్య నేను ఒకటి గమనించాను. మహిళలు కూడా ఫుట్ బోర్డింగ్ చేస్తున్నారు. దిగి ఇంకో బస్ లో వెళ్ళొచ్చు కదా కదిలే బస్ లో ఫుట్ బోర్డింగ్ యెంత ప్రమాదం, ఇలా వేగంగా కదిలే బస్సులు ఎక్కలేక బస్ స్టాప్ లలో ఇంకో బస్ కోసం వేచి చూస్తూ నిలబడి పోతూ వుంటారు ఇంకొంతమంది, వచ్చే బస్ కూడా అలాగే వుంటుంది. మగవాళ్ళ సంగతి వేరు ఎలాగైనా ఎక్కి వెళ్ళిపోతారు. అక్కడక్కడ మహిళలకు ప్రత్యేకమైన బస్ సర్వీసు లు వున్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం. అంతే కాక బాగా కిక్కిరిసిన బస్ లలో ఆకతాయిల గోల, బయట బస్ స్టాప్ లలో కూడా అదే తంతు. బాగా చీకటి పడ్డ తర్వాత కూడా ఇంటికి చేరుకోలేక బిక్కు బిక్కు మంటూ బస్ స్టాప్ లో వుండిపోయే అమ్మాయిలను చూస్తె పాపం అనిపిస్తుంది. అంతే కాదు ఇంట్లో తల్లిదండ్రులకి కూడా టెన్షన్. అందుకే ప్రతీ ప్రాంతానికి కనీసం రెండు మూడు బస్సు సర్వీసు లన్నా ఆర్.టి.సి. నడపాల్సిన అవసరం మహిళలకు ఎంతైనా వుందంటాను. మీరేమంటారు?

No comments:

Post a Comment