Monday, April 20, 2009

చిట్టితల్లి


ఒక ఇంట్లో ఆడబిడ్డ పుట్టింది. మహా లక్ష్మి పుట్టిందనుకున్నారు అంతా, మగబిడ్డ పుట్టింటే బాగుండేది అని ఎవరూఅనుకోలేదు,ఎవరైనా ఒకటే ఈ కాలం లో అని వారి అభిప్రాయం. అనుకున్నట్టుగానే ఆ బంగారుతల్లి మహాలక్ష్మే. పాపపెరిగేకొద్దీ ఆ కుటుంభం కూడా అభివృద్ధిలోకి వచ్చింది. మధ్యతరగతి కుటుంభం ఐనప్పటికీ చట్టితల్లిని కళ్ళ లోపెట్టుకునిచూసుకుంటున్నారు. తండ్రికేమో తను జీవితం లో పడ్డఖష్టాలేవీ ఆ బిడ్డ పడకూడదు అని , బాగా చదుకోవాలి , మంచిస్థాయిలో వుండాలని కోరిక. దానికి తగ్గట్టుగానే ఆ ఇంటి మహాలక్ష్మి బాగా చదివింది. ఎన్ని రోజులు గడచినా ఆ పిల్లవారికి చిట్టితల్లె , అలా కంటిపాపలా చూసుకుంటూ వుండగానే సంవత్సరాలు నిముషాల్లా గడచిపోయాయి. పెరిగిపెద్దదయింది. కాలేజీలో అడుగుపెట్టే రోజు రానే వచ్చింది.మంచి కాలేజీ లో జాయిన్ అయ్యి బాగా చదవాలనినిర్ణయించుకుంది ఆ అమ్మాయి. తన కోరిక కాదనలేక పోయారు ఆ తల్లిదండ్రులూ. హాస్టల్ లో వుండవలసిన పరిస్థితి. తల్లికి భయం వేసింది ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా బంగారు తల్లిని విడిచి వున్నట్టు గుర్తులేదు. తండ్రి పరిస్థితికూడా అంతే. ఇద్దరికీ చిట్టితల్లి ధైర్యం చెప్పి బయలుదేరింది. అయిష్టంగానే కూతురిని హాస్టల్ లో వదిలి వచ్చారు. అప్పటిదాకా ధైర్యంగానే వున్న చిట్టితల్లికి వాళ్లు వదిలి వెళ్తున్నారు అనగానే ఏడుపు కట్టలు తెంచుకుంది. ఇంతదూరంవచ్చాక అలా చేస్తే బాగుండదని బలవంతంగా ఆపుకుంది. వాళ్లు వెళ్ళగానే ఆపుకోలేక బాగా ఏడవడం మొదలుపెట్టింది. కాని నాన్న చెప్పిన మాటలు గుర్తుకొచ్చాయి. బాగా చదవి మంచిమార్కులు తెచ్చుకోవాలి, అదే తన ధ్యేయం. అలాగే చేసింది కాని ఆ దూరాన్ని మాత్రం భరించలేకపోయేది. ఎన్నో సార్లు ఫోన్ లో ఏడ్చేది, వచ్చేస్తాను అనేది. మళ్ళీతనే సముదాయించుకుని వద్దు లే చదువు పూర్తయ్యాక వస్తాను, ఇక ఎక్కడికి వెళ్ళను అక్కడే చడుకుంటాను అనిచెప్పేది. ఆ చట్టితల్లి నించి ఫోన్ వచ్చిన రోజు ఆ ఇద్దరూ అదే లోకంలో వుండేవారు. ఒకరికొకరు ధైర్యం చెప్పుకునేవారు. ఆతర్వాత ఆ అమ్మాయి అనుకున్నట్టుగానే బాగా చదివి ఇంటికి వచ్చింది. కొన్నిరోజులు గడిచాక తండ్రి ఆ అమ్మాయితోఅన్నాడు " ఏమ్మా తరువాత ఏం చేద్దాం అనుకుంటున్నావ్ " అని. "ఏముంది డాడీ ఇక్కడే మంచి కాలేజీ లో డిగ్రీజాయిన్ అవ్వాలి మీదగ్గరే వుండి బాగా చదుకోవాలి " అంది. ఒక మంచి కాలేజీ సెలెక్ట్ చేసి జాయిన్ చేయడానికి వెళ్ళాడుఅక్కడ వున్న కోతిమూక చేసే , టీజింగ్ చూసి అక్కడ చేర్పించేందుకు ధైర్యం చాలక వెనక్కు తీసుకు వచ్చి గిర్ల్స్ కాలేజీలో చేర్పించి కొంచెం ధైర్యంగా వున్నాడు.ఇదిలా వుండగా రెండు సంవత్సరాలు దూరంగా వుండేసరికి తండ్రికి చిట్టితల్లి లోఏదో మార్పు కనిపించింది. కాని తల్లికి మాత్రం చిన్న పిల్లలాగానే కనిపిస్తుంది. తండ్రి , తల్లితో అన్నాడు "మన బంగారు లోఎదోమార్పు కనిపిస్తోంది కదా, బాగా పెద్దదైనట్టు కనిపిస్తోంది". కాని ఆతల్లి అదేం లేదంది. అలా ఆలోచిస్తుండగానే ఇంటివాకిట్లో పోస్టుమాన్ ప్రత్యక్షం అయ్యి ఒక కవర్ ఇచ్చాడు . అది దూరపు బంధువుల పెళ్ళిపత్రిక. ఇప్పుడర్తమైంది తండ్రికిఎందుకు అమ్మాయి లో మార్పూ కనిపించిందో, లీలగా తన భాద్యత గుర్తుకొచ్చినట్టుంది. తన భార్యతో కొంత కాలంఅయ్యాక మన కూతురు , మనకూతురు కాకుండా పోతుందా అని. రాత్రి భోజనాలయ్యాక చిట్టితల్లి హాయిగానిద్రపోతూవుంది. నిష్కల్మషమయిన మనసు తన ముఖం లో స్పష్టంగా కనిపిస్తోంది. అలా చూస్తూ వుండిపోయాడుతండ్రి , తోడుగా తల్లి వచ్చి కూర్చుంది, అంతా నిశ్శబ్దంగా వుంది . కాసేపయ్యాక అలాగే మౌనంగా నిద్రలోకిజారుకున్నారు. "గుడ్ మార్నింగ్ డాడీ" అన్న పిలుపుతో వులిక్కిపడి లేచాడు. "గుడ్ మార్నింగ్ ర బంగారు" అంటూనుదిటిపై ముద్దిచి, వంటింట్లో వున్న భార్యను చూసి" నువ్వుకూడా రాత్రంతా సరిగా నిద్రపోయినట్టు లేవు, కాసేపుపడుకోకూడద" అన్నాడు తనిచ్చిన బ్రష్ అందుకుంటూ. ఇక తరచూ అదే విషయమే చర్చకు వచ్చేది. అమ్మాయిని బాగాచూసుకునే వాడే భర్తగా రావాలని రోజు పూజ చేసేది తల్లి. తండ్రేమో భందువుల లిస్టు చూసి ఏ అబ్బాయిఎలాంటివాడు,ఆ కుటుంభం బాగోగులు ఆరా తీస్తూ వుండేవాడు. పెళ్లిపత్రికలో డేట్ కాస్తా రానే వచ్చేసింది. పెళ్లి వాళ్లుకూడా మంచి కుటుంభమే , వీళ్ళంటే ఆప్యాయంగా చూస్తారు కూడా. కాబట్టి వాళ్ళలో ఎవరైనా నచ్చితే ,ఈడూ జోడూ కుదిరితే , అన్నీ కలసివస్తే బాగుంటుందని అనుకున్నారు. అందరూ కలసి పెళ్ళికి బయలుదేరారు. ఊహించినట్టుగానేఆకుటుంభం చాల బాగా ఆదరించారు. ఇంతలొ ఆ చిట్టి తల్లికి వరసైన , వాళ్ళనుకున్న కుటుంభంలోనే ఒక కుర్రాడుఅమ్మాయిని చూసి మనసు పడతాడు. ఆ అబ్బాయి కూడా మంచివాడే. ఇంతలొ తల్లి ఒక అబ్బాయిని చూసి తనయితేకూతురుకి అన్నివిధాల సరిపోతాడు, మంచి నడవడిక , మంచి కుటుంభం కూడా అని అనుకుంటుంది. ఇలాఅనుకుంటుండగానే చిట్టి తల్లిని ఇష్టపడ్డ ఆ కుర్రాడు తనను పరిచయం చేసుకుని దగ్గరవుతాడు. అదృష్ట వశాత్తూ తల్లిఅనుకున్న అబ్బాయి , ఈ అబ్బాయి ఒక్కడే. కాని ఈ విషయం వాళ్ళల్లో ఏ ఒక్కరికి తెలియదు. ఈ అబ్బాయి చిట్టి తల్లితోచనువుగా వుండడం చూసి తల్లి సంతోషపడుతుంది. కొద్ది రోజుల్లోనే వాళ్ళిద్దరూ మంచి స్నేహితులుగా మారిపోతారు. ఒకరి అభిరుచులు , ఆలోచనలు, ఇష్టాలు,ఇలా అన్నింటిలోనూ సారూప్యతే. ఇది ఇలా వుండగా అమ్మాయి వున్నవూరికే అబ్బాయి కూడా వుద్యోగం కోసం వస్తాడు. అలా ఇద్దరూ దగ్గరవడానికి కాలమే కలసి వచ్చింది. కాని ఏనాడూహద్దుదాటలేదు, ఇద్దరి చనువు చూసి ఒకపక్క తల్లి మురిసిపోతున్నాకూడా ఎక్కడ చదువు పాదవుతుందో అనిహద్దుల్లో వుంచడానికి ప్రయత్నించేది. అబ్బాయి కూడా బాగా అర్థం చేసుకునే మనస్తత్వం , ఒక మంచి కుటుంభం లోభాధ్యత కలిగిన పెద్దకొడుకు. స్త్రీ లంటే గౌరవమ్ , విలువ ఇచ్చే వ్యక్తిత్వం కల వాడు. సమాజం లో స్త్రీలు పడుతున్న అనేకరకాల భాదల్ని చూసి చలించిపోయేవాడు. తనను నమ్ముకుని వచ్చే తన భార్యని ఏ విషయం లోనూ భాధ పెట్టకూడదు, ఇద్దరికీ సమాన హాక్కూ, హొదా వుండాలి , స్నేహితుల్లాగా వుండాలి, అనుకునే వాడు. అందుకే ఏవిషయం లోనూ ఆఅమ్మాయికి నచ్చని విషయాల జోలికి వెళ్ళేవాడు కాదు. ఇలా ఎంతొ అన్యోన్యంగా వుండేవారు. వీళ్ళు ఇలా దగ్గరవడంచూసి తల్లికి తెలియని భయం అందుకే ఎన్నో ఆంక్షలు పెట్టేది చిట్టితల్లికి, ఆ అబ్బాయికి కాదు. ఒకప్పుడు అబ్బాయికిదగ్గరవడానికి కారణమయిన అమ్మ ఎందుకిలా చేస్తుందో తనకి అర్తమయ్యేది కాదు. ఇది గమనించిన అబ్బాయి ఆఅమ్మాయి పైన తనకెంత ప్రేమవుందో , అన్ని పూసగుచ్చినట్టు వివరిస్తాడు. ఇక ఆ తల్లి కొంచెం ప్రశాంతంగావుండగలుగుతున్నా చిట్టి తల్లి మీద ఆంక్షలు మాత్రం అలాగే వుండేవి. అది చూసి ఇద్దరూ చాలా భాద పడేవారు. రానురానూ ఆ అమ్మాయి ఎన్నో పనులు చేయవలసి వచ్చింది. చిన్నప్పటినుండి కాలు కింద పెట్టకుండా చూసుకున్న తల్లిఇప్పుడు అన్ని పనులు నేర్చుకోవాలని ఆజ్ఞాపిస్తుంది. ఇంటిని శుభ్రంగా వుంచాలి, వంటచేయాలి, బాగా చదవాలి, గట్టిగానవ్వకూడదు, బంధువులు ముఖ్యంగా అబ్బయి తరపున ఎవరైనా ఇంటికి రాగానే (ఆరోగ్యం సరిగా లేకపోయినా) నవ్వుతూ అన్ని సపర్యలు చేయాలి,ఇలా ఎన్నో.... ఇవన్నే చూసిన అబ్బాయి చనువుకొద్దీ అమ్మాయి తల్లితో వినయంగావిచారిస్తే " నీకు తెలియదు ఏదో ఒకరోజు ఆడపిల్లకు ఇవన్నీ తప్పదు, వెళ్ళిన చోట మాట పడకూడదు " అంటుంది. అదీఆ అమ్మాయి ముందే.ఇదంతా చూసిన ఆ అబ్బాయి ఆచ్యర్యపోయాడు తను ఆ అమ్మాయిని ఎలాచూసుకోవాలనుకున్నాడు?, తన పుట్టింట్లోనే ఒకరకమయిన తక్కువ తనాన్ని నూరి పోస్తున్నారేమో అనిపించింది. ఇవన్నీ ప్రతీ ఆడపిల్లకు తప్పవా?, ఆత్మాభిమానం ఆడపిల్లకు వుండకూడదా?,భర్తా,అత్తింటి వాళ్లు ఎలాంటి వారయినాతప్పు చేసిన దానిలా వుండవలసిందేనా? ఈ భావాన్ని ఆడపిల్లకు పుట్టింటిలోనే నూరిపోయడం సరి ఐనదేనా? ఇక తండ్రికూడా చెప్పే గొప్ప మాట " సర్డుకుపోవాలమ్మ ", ఎందుకు? ఈ భావన! ఒక్కసారి ఆలోచించండి. పురిటి నొప్పుల భాధదగ్గరనుండి పిల్లాడు కింద పడ్డాడని భర్త కొట్టే చంపదెబ్బ వరకూ ఈ "చిట్టి తల్లి" అన్నీ భరించక తప్పదా?  బంగారు తల్లీ , ఏం చేసి నీఋణం తీర్చుకోవాలి? ఈ "చిట్టి తల్లి " మీ కూతురే కాదు, ఒక తల్లి, చెల్లి, అక్క, ఆడపడుచు ఇలా ఎవరైనా కావచ్చు.
చివరిగా " చట్టి తల్లి" కి విలువనివ్వండి. ఒకరికి చెప్పేముందు చేయడం నాకు అలవాటు. ఆలోచించండి.



5 comments:

  1. Prakash gaaru.. mee blog chaala bagundi.. mukhyangaa.. ee post.. kaani mana samajam ela marutundi? nijame, talli, tandri andaru, inkaa ee "chitti talli" ki etti kudesthe edu chekkalayye vallu anavasaramaina salahalu ichevaalle.. tanu matram..pedda vallu ani variki gauravam ichi emi matladadu.. aa manchi tananni ardham chesukone vallu evaru?

    ReplyDelete
  2. sorry andi, naaku telugu lo ela comment cheyyalo teliyaledu.. and, in fact, I did not want to wait till I learn how to post comment in Telugu. emi anukokandi.. U r at liberty to delete my comment. mee telugu language kuda chala bagundi.

    ReplyDelete
  3. శ్రీదేవి గారు , ఇది నా మొదటి, కొత్త బ్లాగ్ అండి. ముందుగా నా భావాన్ని అర్థం చేసుకున్నందుకు ధన్యవాదములు. నా బ్లాగ్ బాగుందని వచ్చిన మొదటి కాంప్లిమెంట్ మీదేనండి, సంతోషం. కొంతమంది ఐన ఆలోచిస్తారు అన్నఒక చిన్న ప్రయత్నమే నా ఈ "చిట్టి తల్లి" . మీ కామెంట్ కు థాంక్స్.

    ReplyDelete
  4. nijamga chala bagundi....meku chala talent undi baboy!

    ReplyDelete