Tuesday, April 21, 2009

ఇలా కూడా వుంటారా ?

ఇది నా జీవితం లో జరిగిన సంఘటన ఇంతవరకు ఎవరికీ చెప్పుకోలేదు, అంటే చెప్పకూడనిది కాదు కాని.. చెప్తే నవ్వుతారని... సరే ఇక విషయానికి వస్తే , అప్పుడు నేను వుద్యోగం కోసం బెంగుళూరు లో వుండే వాడిని , నెలకి సరిపడా నాన్న పంపించేవాడు, వందో రెండొందలో మిగిలేవి అంతే , సినిమాలంటూ వెళ్తే అవి కూడా గోవిందా.. అలాంటి టైం లో ఒకడు వెయ్యి రూపాయలు టోపీ పెట్టాడు, అదే చెప్పబోతున్నా ముందుగా ఒకటి చెప్పాలి నేను ముసలి వాళ్ళకి , ఆడవాళ్ళకి, అవిటి వాళ్ళకి తప్ప మరెవరికి డబ్బు దానంగా ఇవ్వను. చిన్న పిల్లలకి అస్సలు ఇవ్వను, అడుక్కోవడం అలవాటు చెయ్యకూడదని. అలాంటిది ఒకడి మాటలు నమ్మి వెయ్యి రూపాయలు ఇచ్చేశాను. ఇక విషయం లోకి వస్తే హైదరాబాద్ కి రావాలని 'కెంపెగౌడ' బస్స్టాండ్ కి వచాను, బస్ లేటు అని తెలిసి అలా షాపింగ్ మాల్స్ వుంటే చూద్దామని వెళ్లాను అక్కడేదో చిన్న గొడవ జరుగుతూ వుంది , చుస్తూవున్న నాకు పక్కనే వున్న తెలుగాయన పలకరించాడు. అడక్కుండానే గొడవగురించి చెప్పడం మొదలెట్టాడు." నాకు బంగళూరు వాళ్ళమీద నమ్మకం పూర్తిగా పోయింది "అన్నాడు. ఏమైంది ఆంటే " నాపేరు గుండు రమణారావు ఫిల్మ్ యాక్టర్ గుండు హనుమంతరావు కి తమ్ముడిని" అన్నాడు చూడ్డానికి అలాగే అనిపించాడు. "నేను వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నాను , నాకు పెళ్లి కుదిరింది మా ప్రొడ్యూసర్ కి కార్డ్ ఇద్దామని వచ్చాను కాని తను ఇక్కడ లేడు ఇంట్లో ఇచ్చి వచ్చాను కాల్ చేస్తే కూడా తగలట్లేదు, సరే అని హైదరాబాద్ కి వెళ్ళాలి అర్జెంట్ అని వస్తే నా పర్సు,సెల్ ఫోన్ ఎవడో కొట్టేసాడు, అందులో చాలా డబ్బు, క్రెడిట్ కార్డ్స్, వున్నాయి ఫోన్ చేద్దాము అన్నా నుంబెర్స్ కూడా లేవు, ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కల లో కూడా అనుకోలేదు " అని కన్నీళ్లు పెట్టుకున్నాడు . నాకు వాడు చెప్పింది విని నిజమే ఏమో అనిపించింది. " నాకు టికెట్ కి డబ్బులివ్వండి మీరు కూడా హైదరాబాద్ కి వస్తున్నారు కదా, అక్కడికేల్లగానే మీరే చూడండి నా రేంజ్ ఏంటో ప్లీజ్ ఇలా అడుక్కోలేను ఎవరిని" అంటు ఏడుపు మొదలెట్టాడు. నాఖర్మ కాలి జేబులో వెయ్యి రూపాయల నోటు వుంది ఏం చేస్తున్నానో అర్తం కావట్లేదు అది కాస్త వాడి చేతిలో పెట్టేసాను. వాడు అర్జెంటు అంటాడు, ఫ్లైట్ , అంటాడు...... నాకు అర్తం కాక "డబ్బు ఇటివ్వండి నేను నీకు టికెట్ కొనిస్తాను నాతోపాటే వద్దూరు కాని" అన్నాను. అలా కాదు నేను ఇవాళ పొద్దున్నే అక్కడుండాలి, బస్ లో లేట్ అవుతుంది అర్తం చేస్కొండి అని ఒకటే గోల, చివరిగా నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు , నాకు వాడి మెయిల్ ఇడి ఇచ్చాడు. "మీరు నాకు మెయిల్ చేయండి వెంటనే మీ నెంబర్ కికాల్ చేస్తాను, కార్ పంపిస్తాను మీరు డైరెక్ట్ గా వచ్చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది, నా స్టేటస్ ఏంటో" అని నా చేతులు పట్టుకున్నాడు. వాడు చూడ్డానికి గుండు హనుమతరావు లాగానే వున్నాడు , అందుకే నిజమే అని నమ్మాను. "థాంక్స్" చెప్పి వెళ్ళిపోయాడు. నాకు ఏమి అర్తం కాలేదు. తర్వాత వాడిచ్చిన మెయిల్ ఐడి తప్పని నేను మోసపోయానని తెలిసింది. నేను ఘోరంగా మోసపోయిన మొదటి సంఘటన ఇదే , ఇలాంటి వారు కూడా వుంటారు మీలో కొంతమంది ఐన జాగ్రత్త పడతారని రాస్తున్నా.

3 comments:

  1. హాయ్ అండీ మీ కామెంట్స్ , సలహాలే నేను బ్లాగ్ ని మరింత ముందుకి నడపడానికి ఆధారం.

    ReplyDelete
  2. మీకు నచ్చిన కథ మీ మనసులో అన్నీ చదివాను...బాగున్నాయి అని చెప్పేకంటే మీ మనసుతో చెప్పే మాటలకు విలువ ఎక్కువ ప్రకాష్ గారు..మోసపోవడం తప్పు కాదు, ఎవరు ఎలాంటి సహాయం అడుగుతారో అవసరం లేదు మనం ఆడించే సహాయం మన పరిధి దాతకుంటే చేసిన పని గురించి ఆలోచించే అవసరమే ఉండదు కదండీ...మీ ప్రతీ పోస్ట్ కి నా ధన్యవాదములు..ఇట్లు..రమాదేవి

    ReplyDelete