Saturday, August 6, 2011

స్నేహానికి ఒకరోజేన.....?

స్నేహానికి ఒక రోజు కేటాయించ వలసిన ఆవశ్యకత ఏంటో తెలియదు మరి? అది పవిత్రం, నిత్యమూ. అది లేని సమాజం అంటూ వుండదు, అది ఒక అనుభూతి, మనిషి కి మనిషి కి మధ్య మనసు వేసిన వారధి. మనిషి పుట్టినప్పుడు పుట్టిన ఆ అనుభూతి, భూమి పైన మనిషి మనుగడ ఉన్నంత వరకు సాగుతుంది. పవిత్రమైన స్నేహాన్ని మనం మనకు తెలియకుండానే అనునిత్యం గౌరవిస్తున్నాం. అలాంటిది దానికంటూ ప్రత్యేకంగా కేవలం ఒక రోజుని కేటాయించడం ఆమోదయోగ్యం కాదు. దేన్నైనా సరైన అవగాహనా లేకుండా గుడ్డిగా అనుసరించడం అంటే, మన విలువలను మనమే అవమానించడం.

చివరిగా ఒక వినతి, ఇది నా మనసు నాకు చెప్పిన మాటగా మాత్రమే ఇక్కడ ప్రస్తావించాను.
ఇది ఎవరిని ఆక్షేపించినట్టు కాదు.
ఇతరులకి ఇబ్బంది కలగనంతవరకు, ఎవరికి నచినట్టు వాళ్ళు వుండే హక్కు అందరికి వుంటుంది.

ఇది చూసి వీడు 'నలుగురికి.. నచ్చినది.. నాకసలే ఇక నచ్చదు లే..' టైపు అనుకుంటే ఎక్కడో కాలేసినట్టే... నేనూ మీలాగే ఐనా, మనసు కి అనిపించింది మాత్రం  ఇలా బయట పెట్టే టైపు. నలుగురూ నవ్వుతూ వున్నపుడు నేను మాత్రమే  ఏడిస్తే ఏం బాగుంటుంది... కానీ నేను( నా బుద్ధి) చెప్పింది తప్పు కాదు కదా?  ఏమంటారు...
నాకూ  friendship day wishes చెప్ప వచ్చండి.

మీ,
ఓమ్ ప్రకాశార్య



No comments:

Post a Comment