Sunday, August 21, 2011

ఆత్యాద్మిక సందేహం......

రాముడు, కృష్ణుడు... ఇంకా చాలా మంది ఐతిహాసికులను మనం దేవుళ్ళు గా పూజిస్తున్నాం కదా! అంతకు మునుపు అంటే రాముడి తండ్రి ఐన దశరథుడు ఎవరిని పూజించేవారు? అంతకు మునుపు కూడా భగవంతుడు వున్నాడు కదా? మనం  అందరం భగవంతుడు సర్వాంతర్యామి అని నమ్ముతాం, అందులో ఏ సందేహం లేదు. అంటే అంతటా వ్యాపించిన వాడు అని, అది ఆయన గుణం, అలాంటప్పుడు అవతరిచడం అంటే భగవంతుడు సర్వ వ్యాప్తిత్వాన్ని వదలి ఒక శరీరాన్ని ధరించడం; ఇలా జరిగినట్లయితే భగవంతుడు ఆయన గుణాన్ని వదిలివేయడమే అని స్పష్టం అవుతుంది. ఆ గుణం కోల్పోయిన దేన్నైనా కూడా భగవంతుడు అనడం తప్పు కదా! ఆయన భూమి మిద పుట్టిన ఉత్తమ పురుషుడిగా భావించడం, అనుసరించి గొప్ప వ్యక్తిత్వాన్ని పొందడం శ్రేయస్కరం కానీ భగవంతుడు అనుకోవడం లోనే నా సందేహం. మీ సమాధానాల వల్ల నా సందేహం నివృత్తి అవగలదు అని ఆశిస్తున్నాను.




3 comments:

  1. అదికూడా ఓకే , అందుకే పరబ్రహ్మ ని మాత్రమే పూజించాలి. కాని మనకు ఐహిక సుఖాలు ఎక్కువ కాబట్టి ఈ కోరికల కోసము, రక రకాల గుణాలు ఉన్న దేవతలని కోలుస్తున్నాము. రకరకాల అవతారాలని కోలుస్తున్నాము.

    ReplyDelete
  2. సర్వాంతర్యామిఅని మీరు ఒప్పుకుంటున్నప్పుడు ఆయన ఒకచోట లేడని చెప్పలేంకదా . కొత్తగాపుట్టటం కాదు అక్కడవ్యక్తమయ్యాడని అనుకోవచ్చుకదా. అంటే అక్కడున్నసంగతి మనకు ఇప్పుడే తెలిసిఉండవచ్చు కదా ?

    ఇక్కడ మీ భావం అర్ధమవుతున్నది .
    నేను ఇప్పుడు పదవతరగతి పాఠాలు చెప్పేప్పుడు నాసబ్జక్ట్ గూర్చి తెలిసిన మీరు మరలా అవసరమై ఒకటవతరగతి పాఠాలు చెప్పేప్పుడు నాకు అంకెలు ఎక్కాలే వచ్చు ఆల్జీబ్రారాదనుకోవచ్చా ? అలాగే పరమాత్మ ప్రాథమిక స్థాయిలో మానవులకు అందుబాటులోకొచ్చినందుకు మనం ఆయన సర్వవ్యాపకత్వాన్ని తక్కువగా నిర్ణయించుకోరాదు.
    మనచుట్టూ గాలి ఉంటుంది. కానీ అది మన వాహనంటైర్లోకి అది నేరుగా ఎక్కదు కదా ? దానికొ పంప్ అనే పరికరం కావాలి.
    అలాగే అనంతగుణసంపన్నుడైన ఆయన తత్వాన్ని మనం అవగాహన చేసుకోవటం కోసం అపారకరుణతో ఆయన మనదగ్గరకే వచ్చిన లీలా విశేషాలను అమాయకత్వంతో తిక్కతర్కాలతో అనుభవానికి తీసుకునే అదృష్టం కోల్పోరాదు మనం.

    ReplyDelete
  3. దుర్గేశ్వర గారు ముందుగా నమస్కారమండి మీ 'హరి సేవ', 'దైవ లీలలు' చూసాను చాలా బాగున్నాయి. ఇక మీరిచ్చిన సమాధానం లో "మనచుట్టూ గాలి ఉంటుంది. కానీ అది మన వాహనంటైర్లోకి అది నేరుగా ఎక్కదు కదా ? దానికొ పంప్ అనే పరికరం కావాలి." అని కదా, కానీ వాహనం టైర్ లో ఇదివరకు గాలి లేదు మరియు స్వతహా గ టైర్ లోకి వెళ్ళలేదు కాబట్టి పంప్ అనే పరికరం కావాలి, కానీ భగవంతుడి విషయం అలా కాదు ఆయన సర్వాంతర్యామి ఆయని జ్ఞానం అనంతం సంకల్ప మాత్రం చేత శ్రుష్టి చేసిన ఆయన ఒక చిన్న కార్యం చేయడానికి మానవ రూపం లో పుట్టవలసిన ఆవశ్యకత ఏమిటి? ఒక సారి ఆలోచించండి.

    ReplyDelete