
అందరికి నమస్కారం, ఆధ్యాత్మిక పరమైన విషయాలపై నాకున్న జ్ఞానాన్ని పెద్దలతో చర్చించాలని చాలా రోజులుగా అనుకుంటూ ఇప్పుడు ముందడుగు వేస్తున్నాను. ఆధ్యాత్మికంగా నాకు అర్థం కాని , అర్థం అయినా మనసు అంగీకరించక అయోమయం లో పడ తోసే కొన్నింటి పైన చర్చ జరపాలని ఆ చర్చ నాకే కాకుండా నా బ్లాగ్ వీక్షించే వారికీ వుపయోగకరంగా వుండాలని నేను ఆశిస్తున్నాను. అనుభవ రాహిత్యం వల్ల నేనడిగే ప్రశ్నలు పెద్దలను నొప్పించినా, నేను ఆ ప్రశ్న అడగడం వెనుక గల అర్థాన్ని గమనించి సమాధాన పరచగలరని ఆశిస్తున్నాను. ప్రశ్నలన్నీ నేనే అడగాలని లేదు బ్లాగ్ వీక్షించే అందరు అడగ వచ్చు. ఇది ఒక చర్చా వేదిక మాత్రమె. ఈ విషయమై ఆసక్తి కల పెద్దలనుండి వచ్చే అభిప్రాయాలను గమనించి మొదలు పెట్టాలనుకుంటున్నాను మీ అబిప్రాయాలు తెలుపగలరు.
No comments:
Post a Comment