Sunday, August 9, 2015

మనిషి కి... గొడ్డుకి తేడా వుండనక్కర లేదా?.....

మనిషి కి... గొడ్డుకి తేడా వుండనక్కర లేదా?
ఈ సృష్టి లో ఎంతో పుణ్యం చేస్తే కాని మనిషి జన్మ దొరకదు అంటారు . కాని మనిషి పుట్టాక పుణ్యం అంటే ఏంటో మరిచిపోయాడు. అలా మరిచిపోవడం మనిషి తప్పా? లేక ఈ పుట్టుకనిచ్చిన ఆ దేవుడిదా? తెలివి మీరిన మనిషి తన తప్పులని ఎప్పుడు ఎదుటి వాడిమీదకి నెట్టేస్తాడు... ఒప్పుకోడు... కాబట్టి ఇక్కడ తప్పు దేవుడిదే అంటాడు. అవును... ఇక్కడ నిజంగానే దేవుడు ఒక పెద్ద దిద్దుకోలేని తప్పు చెశాడు. అదేంటో తెలుసా....? మనిషి కి ... గొడ్డుకి తేడా... అవును... దాన్నే మనం తెలివి అనొచ్చు. ఏదైనా ఎక్కువైతే.. అతి సర్వత్రా వర్జయేత్... అది మనకు కీడు చేస్తుంది... నమ్మదగిన నిజమ్.... నమ్మరా? ఉదాహరణ కు... బలి చక్రవర్తి.. రావణ భ్రమ్హ... సుయోధన... చాలా? అల్లాగే ఇప్పుడు మనిషికి తెలివి చాలా ఎక్కువైంది... అతి తెలివి...అతి సర్వత్రా వర్జయేత్...ఫలితం? నాశనం.. సృష్టి వినాశనం... వాడు చేసిందే సరైంది అని నమ్ముతాడు... నైతిక విలువలకు తిలోదకం... కావలసింది ఆక్రమిచేస్తాడు... తన సంతోషం కోసం ఎవరినైనా బాధ పెట్టేస్తాడు... వాడిది భస్మాసుర హస్తం అని తెలిసినా అలవాటు మానుకోలేని మానసిక పరిస్థితి.... మానసిక, శారీరక అనారోగ్యమ్... తదుపరి వైద్య దర్శనం ఆ మధ్య లోనే  దైవ దర్శనం... వైద్యుడికి చెక్కులు... దైవానికి మొక్కులు... ఇక్కడో సందేహం??? వైద్యుడు అడిగాడు సరే... దేవుడు అడిగాడా? దీనికి సమాధానం మనఃస్సాక్షి వున్నఎవడికైనా తెలుస్తుంది... తెలియకపోతే మాత్రం వినండి భగవంతుడు దేన్ని ఆశించడు... ఆశిస్తే భగవంతుడు కాడు... ఇక్కడ చెక్కులను పక్కన పెట్టి మొక్కుల గురించి మాట్లాడుకుందాం. అడగని మొక్కులు... పోని అవి ఎలా ఉండాలో తెలుసా? అందులో న్యాయం, ధర్మం, మంచితనం, సహాయం, సంతోషం ఇలా ఏదో ఒకటి లేద కొన్నింటి ఫలిత రూపం ఐనా ఐతే వాటివల్ల మంచి జరుగుతుంది అని అనుకోవచ్చు. కానీ మనిషి.. ప్రాణాలను బలి పెట్టి మొక్కులు తీర్చుకుంటున్నాడు అంటే అతిశయోక్తి కాదు... నమ్మ గలరా? కానీ  నిజం.. ఇక్కడ ఖర్మ ఏంటంటే బలి పెడుతున్న ప్రాణాలు తనవి కాదు అభం శుభం ఎరుగని మూగ జీవాలవి. మనుషుల మొక్కులకి ఏవిధంగా ఐనా సంభంధం లేని అమాయక జంతువులను బలి ఇవ్వడం మసి బారిన మానవ నైతికతకు అనాగరిక నిదర్శనం కాదా.. అమ్మ వారికి బలి.. ఎవరికి అమ్మ? ఒక్క మనిషికే కాదు విశ్వ ప్రాణి కోటి కీ తల్లి. కాదని అనగలరా? ఆ ప్రాణి కోటి లోని ఒక భాగం లో మనం బలి పేరుతొ హత్యలు  చేస్తున్న మేకలు, కోళ్ళు, ఇతర జీవులు వున్నాయి కదా. మరి ఒక తల్లి ఒక బిడ్డ బాగుండాలంటే ఇంకో బిడ్డని బలి ఇవ్వమని అడుగుతుందా? మరి ఎవరు అడిగారని ఆ అమాయక ప్రాణులను చంపేస్తున్నాం.. మీ నైవేద్యం ఆ మూర్తి కి అందుతుందా? ఇది ఎంతో పుణ్యం చేసి సంపాదించిన పవిత్రమైన మానవ జన్మ ను మన అతి తెలివితో అపవిత్రం చేసి మళ్ళీ మళ్ళీ అపార పాప పూరితమైన అజ్ఞాన సంపదను మన పిల్లలకు తరువాతి తరానికి కూడా మూట కట్టుకుంటున్న ఈ మనిషి తరువాతి జన్మ ఏమై వుంటుందో తెలియదు కాని ఫలితం అనుభవిస్తాడు కదా?
పాప పుణ్యాలు బాలెన్స్ షీట్ లో వుండవు... దేని ఖాతా దానికే అని తెలుసుకోవాలి. పాప ఫలితం అనుభవించాల్సిందే అలాగే పుణ్య ఫలం కూడా అనుభవించాల్సిందే... దానికి దీనికి చెల్లు అంటే కుదరదు. కాని జంతువులూ పక్షులకు ఈ విధంగా జరుగదు కారణం మనిషిలా వాటికి మంచి చెడుల నిర్ణయ జ్ఞానం వుండదు. వాటికి  భాగవత్ప్రసాదితమైన సాధారణ జ్ఞానమే తప్ప వేరొకటి వుండదు. అందుకే మనిషికి గొడ్డు కి  తేడా వుండాలి. వుంది కుడా కాకపొతే మనకన్నా అవే నయం అనిపించేంత తేడా... ఒక వేళ నిజంగా బలి కోరే దేవతో దేవుడో వుంటే దేనికో పుట్టినవో తెలియని వాటికన్నా నీకేపుట్టిన బిడ్డలని బలి ఇవ్వండి చూద్దాం... మీది కాని వాటిని ఇవ్వడానికి మీకేం హక్కు వుంది? మనం మన కడుపున పుట్టి, అల్లారు ముద్దుగా పెంచుకున్న మన బిడ్డని మన సంపద పెరగాలనో, మన ఆరోగ్యం బాగుండాలనో, వ్యాపారం వృద్ధి చెందాలనో ఇంకేదో రావాలని బలి  ఇచ్చుకుంటాను అని మొక్కుకోండి చూద్దాం? ఏం వాటివి ప్రాణాలు కావా? వాటి పిల్లలను బలవంతంగా లాక్కెళ్ళి ఘోరంగా చంపేస్తుంటే దాన్ని చూస్తూ కూడా మనిషిని ఏమీ చేయలేని పరిస్థితి లో వాటి మానసిక స్థితి ఎలా వుంటుందో అర్థం చేస్కోవడానికి ప్రయత్నించండి. దయ చేసి ఈ దురాచారాన్ని అరికట్టండి. మీరెవరికి ఐతే బలి ఇస్తున్నారో ఆ దేవుడికో లేక దేవతకో కూడా అయిష్టమైన అనాచారాన్ని ఆచారంగా భావించి చేస్తున్న ఈ పని ఒక ఘోరమైన పాప ఖర్మ. ఒక్కసారి ఆలోచించండి

6 comments:

  1. Problem is known. and people are fighting also. reiterating the problem is not the solution.


    If you have any solution to it that would be better for better society. criticizing is easy and anybody can do it. Try to find a solution then take it to higher level.spread we can create awareness then.

    ReplyDelete
  2. Thanks manohar. every one knows the fact I reacted on and shared my perspective thats it. Even I have stared and ready to take it higher level also. if we think about the solution then it is not only in my hand it is the duty of everyone to spread and stop such cruel things and every one should change their mind set.

    ReplyDelete
  3. nice
    hi
    We started our new youtube channel : Garam chai . Please subscribe and support
    https://www.youtube.com/channel/UCBkBuxHWPeV9C-DjAslHrIg

    ReplyDelete
  4. definately there was a difference between human and animal,well said.
    https://goo.gl/Yqzsxr
    plz watch and subscribe our new channel

    ReplyDelete
  5. nice blog
    https://goo.gl/Ag4XhH

    plz watch our channel

    ReplyDelete