Friday, June 12, 2015

మహా పాపం....

ఆత్మహత్య మహా పాపం, ఘోరం... ఎంత కష్టమొచ్చినా గానీ, ఎన్ని ఆటంకాలు ఎదురైనా గానీ మొండిగా ధైర్యం తో జీవితం మీద పోరాటం ప్రకటించాలి విజయం సాధించాలి భయం అనేది చావు తో సమానం అది ఎవరిని వదలదు కాని చచ్చి బ్రతకాలి బ్రతికి సాధించాలి ఆ మొండి తనం మీ సొంతమైతే విజయం మీ బానిస. ఎవరి జీవితమైనా పూల పానుపు అస్సలు కాదు అని గ్రహించాలి ఎవరైనా ఆనందంగా కనిపించారంటే వాళ్లకి అన్ని సంవృద్దిగా వున్నాయని కాదు వాడికి ఆ క్షణం ఎలా బ్రతకాలో తెలుసని అర్థం. 'వర్షం వచ్చేముందు గాలి ఒక్క క్షణం ఆగిపోతుంది.. విజయం వచ్చేముందు జీవితం ఒక్క క్షణం ఆగిపోతుంది' అన్నది ఒక సినిమా లో సందేశమే ఐనా అక్షరాల నిజం. ఆ ఒక్క క్షణమే జీవితం లో మహత్తరమైన మార్పుకి శ్రీకారం. ఆ క్షణం అన్నది నిజంగా క్షణమే కావచ్చు లేదా ఒక రోజు, ఒక వారం, కొన్ని సంవత్సరాలు... భరించు ఎందుకంటే అది ( ని బాధకి కారణమైనది ఏదైన కావచ్చు ) నీతో పాటు పుట్టిన తోబుట్టువు కాదు నీ  వయసంత వయసు దానికి లేదు.. చాలా చిన్నది భయపడకు... ఆ తర్వాత కాలం నీ సొంతం అని నమ్ము... జీవితం మీద కొత్త ఆశలు పెట్టుకుని మళ్ళి.. మళ్ళి ప్రయత్నించు విజయం వరించే వరకు పోరాడు... అది ఎప్పటికైనా నీ సొంతం... నమ్ము చావకు.. 

మొన్న నా స్నేహితుడు ఆత్మ హత్య చేస్కున్నాడు... దానికి ముందు వాడిని కలిసే అవకాశం వుండి వుంటే అంతటి అనర్థం జరిగుండేది కాదు... వాడి తో చెప్పాలనుకున్న మాటలే ఇంకెవరికైనా ఉపయోగపడగలవని ఇక్కడ పంచుకుంటున్నాను. 

వాడి ఆత్మకి శాంతి చేకూరాలని... 

No comments:

Post a Comment