Sunday, March 22, 2009

వేదములు , ఉప్రమాణములు

సమస్త ధర్మములకు మూలము వేదములు. మానవునకు కావలసిన విజ్ఞానము సర్వమూ వేదములలో బీజరూపముగా అనగా సూక్ష్మ రూపముగా వున్నదని వైదికుల మతము. వేదములనే సంహితలు అని కూడా అంటారు. ఒక వస్తువు యొక్క అస్తిత్వమును అంగీకరించాలన్నా , నిరాకరించాలన్నా మనకు ప్రమాణమొకటి అవసరం. ప్రమాణములు నాలుగు విధములు. అవి ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అని నాలుగు విధములు. "లక్షణ ప్రమానాభ్యాం వస్తు సిద్ధి:"-లక్షణములను బట్టి, ప్రమాణములను బట్టి యిది ఫలానా వస్తువని నిర్ణించడంజరుగుతుంది. ప్రమ - అంటే జ్ఞానము. ప్రమాణము అంటే జ్ఞాన సాధనము . కన్నులు , చెవులు, ముక్కు, చర్మము, నాలుక అను ఇంద్రియముల ద్వారా జ్ఞానము కలుగును. కావున ఇంద్రియములు ప్రమాణములగును. వీనివలనకలుగు జ్ఞానము ప్రత్యక్షజ్ఞానమగును. అక్షి అంటే కన్ను, అక్షము అంటే ఇంద్రియము. ప్రతి + అక్షము = ప్రత్యక్షము. అంటే ప్రతి ఇంద్రియము. ఇంద్రియముద్వారా తెలియబడు జ్ఞానము ప్రత్యక్షజ్ఞానము అవుతుంది. నేత్రములద్వారాదృశ్యములు చూచి తెలుసుకొనడం, చేవులద్వారా శబ్దములను విని గ్రహించడం, చర్మముద్వారా స్పర్శజ్ఞానముకలగడము, ముక్కుద్వారా వాసనచూచి తెలుసుకొనడం యివన్నీకూడా ప్రత్యక్షజ్ఞానము క్రిందకి వస్తాయి.

తరువాతి పోస్ట్ లో అనుమాన ప్రమాణము తో కలుద్దాము....................

No comments:

Post a Comment