Thursday, June 16, 2011

మన్నించు


నేను తెలిసి కొన్ని, తెలియక కొన్ని చాల తప్పులు చేసాను..... అంగీకరిస్తున్నాను.
కానీ ఒక్కటి మాత్రం నిజం; ఆ తప్పుల వల్ల ఎవరు ఇబ్బంది పడలేదు. ఐనా నా మనసు ఒప్పుకోవడం లేదు.
ఆ భగవంతున్ని ఒకటే కోరుకుంటున్నాను........
సర్వాంతర్యామి అయిన ఓ భగవంతుడా 
అన్నింటా నువ్వున్నావని నమ్ముతున్నాను
నా లో కూడా వున్నావు; మరి నా మనసెందుకు అదుపులో లేదు?
నువ్వున్న చోట తప్పు జరగకూడదు కదా?
అంటే ఖర్మ కి నువ్వు భాద్యుడివి కావు; ఎవరికి వారే వారి బుద్ధి ని అనుసరించి జ్ఞానాన్ని పొందాలని,
చేసిన ఖర్మ ఫలాని అనుభవించాలని అర్థమైంది.
అయితే ఒక విన్నపం; నాకు మనసుని జయించనవసరం లేదు కానీ అదుపులో పెట్టుకునే శక్తిని ఇవ్వు.

చదివిన పెద్దలకి విన్నపం; మనసుని అదుపులో పెట్టె మార్గం ఏదైనా వుంటే విశదీకరించండి. నాకే కాదు,
అవసరమనుకున్న ప్రతి ఒక్కరు ఆచరించవచ్చు కదా. మీ మాట ఒక మంచి మార్గం కావొచ్చు.
శుభోదయం.

 మీ ఓమ్ ప్రకశార్య.











Wednesday, June 15, 2011

శుభోదయం

అందరికి శుభోదయం ఈ ఉదయం మొదలు ప్రతి దినం అందరు సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో కుటుంభం అంతా నవ్వుల వనంగా చల్లని మంచుకొండలో వేసవి విడిది లా నవ్వుతూ బతకాలని కోరుకుంటూ

మీ
ఓమ్ ప్రకాష్ ఆర్య