Wednesday, September 2, 2009

పాండవులు


రూమ్ లో సాయంత్రం అందరూ కలిసున్నప్పుడు స్నేహితులందరూ కలసి పిచ్చాపాటి మాట్లాడుకోవడం అలవాటు. సరదాగా గడిచి పోతుంది సమయం, ఎవరికీ నచ్చిన జోక్స్ వాళ్లు చెప్తున్నారు. మధ్యలో ఎందుకో పాండవులగురించి వచ్చినప్పుడు, సాధారణంగా మనం వినే వుంటాం పాండవులకి ఆపేరు ఎలా వచ్చింది అంటే " అప్పట్లో పాంట్లు లేవు కదండీ , అందరూ పంచలే కట్టేవారు అలాగే పాండవులు కూడా పంచలు కట్టుకోవడం వల్ల వాళ్ళకి పంచపాండవులు అని పేరు వచ్చింది" అని, అవునా ఐతే పాండవులు ఎంతమందిరా అని ఇంకో ప్రశ్న వేస్తే ఏం సమాధానం వస్తుంది చెప్పండి...... ఏమో ఇంకెవరైనా ఎలా చెప్తారో నాకు తెలీదు కాని, మా స్నేహితుల్లో ఒకడు మాత్రం ఇలా చెప్పాడు " పంచ పాండవులు మంచం కోల్లవలె ముగ్గురు" అంటూ తన ఎడమ చేతి రెండు వేళ్ళను చూపించాడు. అంతే నవ్వుఆపుకోవడం నావల్ల కాలేదు. బహుశా తను ఇంకెక్కడైనా విని వుండవచ్చు లేదా చూసి వుండవచ్చు, నేను వినడం ఇదే మొదటిసారి కావడం వల్ల చాల సేపు నవ్వాగలేదు.