Monday, August 31, 2009

చర్చిద్దాం

నేను ఒకసారి నా బ్లాగ్ లో విగ్రహారాధన గురించి " మనకున్న మూఢ నమ్మకాల్లో విగ్రహారాధన కే అగ్రతాంబూలం. మీరేమంటారు?" అని రాసాను చాలా మంది తమ తమ అభిప్రాయాలు వెళ్ళబుచ్చారు. ఐతే భగవంతుడికి ఆది అంతాలు వర్తించవు , ఆయన నిరంతరము, కాని కొన్ని వేల సంవత్సరాలకి పూర్వం విగ్రహాలు లేవు కదా? మధ్యలో వచ్చినవే కదా? మరి అవి దేవుల్లెలా అవుతాయి? అంతే కాకుండా భగవంతుడు సర్వాంతర్యామి ఐనప్పుడు విగ్రహం భగవంతుడు ఎలా అవుతుంది?

నాకు నచ్చిన కథ

ఇది చదివిన కథ కాదు.... చూసిన కథ.... టీవి లో చూసాను.... నాకు బాగా నచ్చింది అందులో ఒకపాత్ర రాళ్ళపల్లి గారు చేసారు.పేరు గుర్తు లేదు.... ఇక కథ లోకి వెళ్తే ముఖ్య పాత్ర రాళ్ళపల్లి గారిది, అందులో ఆయన ఒక కిరానా కొట్టు యజమాని గా నటించారు...కాదు జీవించారు.... ఆయన పాత్ర విషయానికొస్తే ఒక నిష్కల్మషమైన, పదిమంది మంచి కోరే మనసున్న మనిషి...ఎవరైనా ఆపద లో వుంటే తనకున్నదంతా ఇచ్చేసి వారు పడే సంతోషం తో కడుపు నింపుకునే వ్యక్తీ.
అంతే కాకుండా వూళ్ళో అందరూ తన మంచి తనాన్ని చేతకాని తనంగా భావించి పబ్బం గడుపుకునేవాల్లె, అది తెలిసినా తన మంచి తనాన్ని వదలలేకపోయేవాడు. చాలా మంది డబ్బు తరువాత ఇస్తామని కొట్టునుండి సరుకు తీసుకుని మళ్ళీ కనిపించేవారు కాదు,ఒకవేళ ఎవరినైనా సరుకులకి డబ్బు ఎప్పుడిస్తారు అని అడిగినా మాట దాటవేసేవారు. ఇలా వుండగా వూళ్ళో గుడి కట్టడానికి చందాలకోసం కొంతమంది పెద్దమనుషులు ఆయన దగ్గరకు వచ్చి డబ్బు అడుగుతారు, భగవత్కార్యానికే కదా అని ఒక వెయ్యి రూపాయలు విరాళంగా ఇస్తాడు, కాని ఐదువందల రూపాయలే ఇచినట్టు రాయమని చెప్తాడు,వాళ్లు అలాగే రాసి వెళ్ళిపోయాక, అదిగమనించిన ఒక మిత్రుడు ఎందుకలా రాఇంచావు ఒక వేళ వాళ్లు రాసింది ఐదువందలే కదా అని మిగిలింది జేబులో వేసుకుంటే ఎలా? అని అడుగుతాడు. అప్పుడు కొట్టు యజమాని " అలా జరుగుతుంది అని నేను అనుకోలేదు మంచిపనికి ఇచ్చింది హృదాగా పోదు, ఇక అలా తక్కువగా ఎందుకురాసానంటే, అది చూసిన పెద్దలు నాకన్నా తక్కువ ఇస్తే బాగోదనే వుద్దేశం తో, అంతకు మించి ఇస్తారు దైవకార్యానికి ఎక్కువ డబ్బు సమకూరుతుంది కదా" అంటాడు. కాని తను అనుకున్నట్టుగా అక్కడ జరగదు. అందరూ "శెట్టి గారికేం బాగా డబ్బుంది ఏమైనా చేస్తాడు మాకేం డబ్బులు చెట్లకు కాయట్లేదు" అంటూ పది, యాభయ్ అలా ఇస్తారు.... ఇది ఇలా వుండగా చివరికి భార్యా పిల్లలకు జబ్బు చేస్తే కూడా వైద్యానికి ఒక్క పైసా కూడా వూళ్ళో అతనికి పుట్టని పరిస్థితి ఏర్పడుతుంది. పైగా పరిస్థితుల్లో కూడా పాత బాకీలు వసూలు చేయాలనుకునే వాళ్లు కూడా ఎదురవుతారు. తన వల్ల ఊరికి, వూళ్ళో వాళ్ళకి ఎంతో మేలుజరిగినా చివరికి వాళ్ల ప్రవర్తన తన మనసుకి గాయం చేస్తుంది. వూరు వదలి వెళ్ళిపోతాడు. అందరు అప్పులు చేసి అవి తీర్చకుండా పారిపోయాడు అంటారు. అలా వెళ్ళిన తను ఒక చిన్న వ్యాపారం మొదలెట్టి దాన్ని అంచలంచలుగా పెంచి గొప్ప ధనవంతుడిగా మారి తన వూరిలో ఒకప్పుడు తనకు డబ్బు సహాయం చేసిన వాళ్ళందరికీ తిరిగి డబ్బు ఇచ్చేయాలని చాలా సంవత్సరాల తర్వాత ఆ ఊరికి వస్తాడు. ఆ వూరు ఏమి మారినట్టు కనిపించదు, తనకు మంచి మిత్రుడిగా వున్నా బడి పంతులు మాత్రం ఆప్యాయంగా పలకరిస్తాడు. సాయంత్రం వూరివారందరిని గుడి దగ్గరకి పిలిచి వాళ్ల వాళ్ల డబ్బు తిరిగి ఇచేస్తాడు. తర్వాత సాయంత్రం తిరిగి వెళ్తూ తన మిత్రుడిని పిలిచి నేను ఇన్నాళ్ళకి డబ్బు తిరిగి ఇచ్చినందుకు మన వాళ్లు ఏమనుకుంటున్నారు అని అడుగుతాడు, అపుడు ఆ పంతులు గారు ఎందుకు లేరా ఎవరిడబ్బు వాళ్ళకి ఇచ్చేసావ్ కదా అవన్నీ ఎందుకు ఇక అంటే, చెప్పమని బలవంతం చేస్తాడు. ఏముంది రా మన ఊరి వాళ్లు ఏమి మారలేదురా...నువ్విచ్చిన డబ్బు తీస్కుని కూడా నిన్నే అంటున్నారు ఎవడి తలమీద చేయి పెట్టి, ఎంతమందిని ముంచి ఉంటాడో లేకపోతె ఇంత తొందరగా అంత డబ్బు సంపాదిస్తాడా....ఇలా ఎవరికీ తోచినట్టు వాళ్లు అనుకుంటున్నార్రా... అని చెప్పేసరికి తీక్షణంగా నవ్వుకుంటూ వూరు దాటి వెళ్ళిపోతాడు..... ఈ కథంతా చూసాక "సొంత లాభం కొంత మానుకు పొరుగువారికి తోడు పడఓయి " అన్న సామెత ఒకరకంగా తప్పేమో అనిపిస్తుంది కదా...స్వలాభం కూడా చాల అవసరం, అలాగే ఇతరులకి ఎంత సహాయం చేయాలో అంత చేస్తే చాలు.

Thursday, August 27, 2009

చర్చిద్దామా?


అందరికి నమస్కారం, ఆధ్యాత్మిక పరమైన విషయాలపై నాకున్న జ్ఞానాన్ని పెద్దలతో చర్చించాలని చాలా రోజులుగా అనుకుంటూ ఇప్పుడు ముందడుగు వేస్తున్నాను. ఆధ్యాత్మికంగా నాకు అర్థం కాని , అర్థం అయినా మనసు అంగీకరించక అయోమయం లో పడ తోసే కొన్నింటి పైన చర్చ జరపాలని చర్చ నాకే కాకుండా నా బ్లాగ్ వీక్షించే వారికీ వుపయోగకరంగా వుండాలని నేను ఆశిస్తున్నాను. అనుభవ రాహిత్యం వల్ల నేనడిగే ప్రశ్నలు పెద్దలను నొప్పించినా, నేను ప్రశ్న అడగడం వెనుక గల అర్థాన్ని గమనించి సమాధాన పరచగలరని ఆశిస్తున్నాను. ప్రశ్నలన్నీ నేనే అడగాలని లేదు బ్లాగ్ వీక్షించే అందరు అడగ వచ్చు. ఇది ఒక చర్చా వేదిక మాత్రమె. విషయమై ఆసక్తి కల పెద్దలనుండి వచ్చే అభిప్రాయాలను గమనించి మొదలు పెట్టాలనుకుంటున్నాను మీ అబిప్రాయాలు తెలుపగలరు.

1880 అలనాటి అందాలు మరికొన్ని

ఓరుగల్లు ముఖద్వారము
అలనాటి అతివల వేషధారణ
డిల్లీ గేటు (ఇప్పటి ఎర్ర కోట )
ఆసుఫ్ గంజ్ గుల్బర్గా

Sunday, August 23, 2009

అందరికి వినాయకచవితి శుభాకాంక్షలు

మీకు మీ కుంటుంబ సభ్యులందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. మీరు చేసే అన్ని మంచిపనులు నిర్విఘ్నంగా సాగాలని ఆశిస్తున్నాను.

Saturday, August 22, 2009

అలనాటి వైభవం

లార్డ్ కర్జన్

హైదరాబాద్

హుస్సేన్ సాగర్ ఆనాటి అందాలు.

హజరత్ బహదూర్షా జాఫర్ - ఢిల్లీ ని ఒకప్పుడు పాలించిన చక్రవర్తి.

చింతలరాయస్వామి దేవాలయం తాడిపత్రి.

పంతొమ్మిదవ శతాబ్దం నాటి మన భాగ్యనగరం.

Wednesday, August 19, 2009

స్వైన్ ఫ్లూ.....


స్వైన్ ఫ్లూ..రాకముందే దాన్ని దూరంగా వుంచడం మంచిది.
అదీ మన ఇంట్లో రోజూ వుపయోగించే ఆహార పదార్థాలతో........
అవేంటో చూడండి , పాటించి పదిమందికి చెప్పండి... అరికట్టడం లో పాలుపంచుకోండి...
  1. లవంగం నూనె ని ఒక క్షణం వాసన పీల్చండి.
  2. ప్రతి రోజు ఒక లవంగం తినండి.
  3. అల్లం,వెల్లుల్లి,వుల్లి.... కొంచెంగా పచ్చివే తినండి.
  4. వేడి పాలల్లో రెండు గ్రాముల పసుపు కలిపి తాగండి.
  5. విటమిన్-సి విరివిగా దొరికే పళ్ళను ఎక్కువగా తీసుకోండి.
  6. బయటికేల్లెతప్పుడు నీలగిరి తైలాన్ని కొంచెం జేబు రుమాల్లో చల్లి ముక్కు కి అడ్డుగా పెట్టుకోండి.
వీటితోపాటు ఇంట్లో పాటించవలసిన ఒక చిట్టి చిట్కా......
ఒక చిన్న గిన్నెలో నీరు పోసి అందులో కొచెం కర్పూరం వేసి గదిలో ఒక చోట పెట్టండి. అది ఒక రోజు , రెండు రోజుల వరకు వుండి కరిగిపోయాక మళ్లీ అలానే చేయండి. ఇలా ఇంట్లో ప్రతి గదిలో వుంచండి. అలా చేయడం వల్ల వ్యాధి కారక క్రిములు దరిచేరవు. ఇవన్ని చాలా సులభంగా పాటించదగ్గ ఆరోగ్యకరమైన చిట్కాలు.