Tuesday, April 28, 2009

మొదటి ప్రేమ లేఖ

నా ప్రాణమా....

ఇపుడు చెప్పు నిన్ను వదిలి నేను ఉండగలనా?
ఎందుకంటే నాకు అన్నింటికన్నా...అంతెందుకు నాకన్నా...నువ్వే ఎక్కువ. నాకు చిన్న పిల్లలంటే ఎంతిష్టమో...
కల్మషం లేని మంచి మనసు వారి సొంతం, అదే నీ సొంతం , అదే ఇపుడు నా సొంతం కూడా... ఎందుకంటే
నువ్వు నా సొంతం.

ఒకటి చెప్పనా... ప్రకృతికి నీకు చాలా దగ్గరి పోలికలున్నాయి తెలుసా? అది మారుతూ ఉంటుంది. నీ లాగే...
నీ కోపాన్ని ఎండాకాలం అనుకుంటే అది నాకు చాలా ఇష్టం,ఎందుకంటే మద్యాహ్నం ఎండా భరించలేకపోయినా...
కాలంలో తెల్లవారుఝామున...సాయం సంధ్యల్లో...ఎంత బావుంటుందో కదా!... నీ కోపం కూడా అంతే అందుకే నాకు చాలా ఇష్టం. తగ్గాక జీవితానికి సరిపడా ప్రేమను ఇస్తావు.

నీ మౌనాన్ని శీతాకాలం అనుకుంటే అది ఎంత వెచ్చదనాన్ని ఇచ్చి,... స్వప్నలోకంలో విహరించేలా చేస్తుంది.
నీ కోపం తగ్గాక నిన్ను నాదగ్గరికి తీసుకుంటే చిన్నపాపలా ఒదిగిపోతావు...అపుడు ఆలోకం నా దగ్గరే ఉంటుంది.
అందుకే అదన్నా నాకు చాలా ఇష్టం.

ఇక నీవు సంతోషంగా నవ్వుతూ ఉంటే నాకు వర్షాకాలమే కదా!... అది నచ్చని వారెవరుంటారు? నాకు చాలా ఇష్టం.

కోపం , మౌనం , సంతోషం మూడూ ఎక్కువైతే? అమ్మో...
ఎండ ఎక్కువైతే చిరాకు,
చలి ఎక్కువైతే మనసు బాగోదు, నిద్ర పట్టదు,
వర్షం ఎక్కువైనా ఇబ్బందే కదా!...

కానీ నాకా భయం లేదు... వీటిని అదుపు చేసే ఆయుధం నీ దగ్గరుంది... అదే అర్థం చేసుకునే మంచి మనసు.
నువ్వు నా సర్వస్వం... నువ్వు నన్ను నాకన్నా బాగా అర్థం చేసుకుంటావు. నామీద నీ ప్రేమ, నన్ను అదుపులో పెట్టేందుకు వాడే అధికారం... ఇంత నచ్చాయని ఎలా చెప్పగలను?... అనుభూతులకు అక్షర రూపం ఇవ్వలేనేమో?

నీ ప్రేమను పొందిన క్షణం ఎలా మరచిపోగలను?అదొక గొప్ప విజయం. గడచిపోయిన కాలంలో నువ్వు నన్ను బాధపెట్టినట్టు గుర్తు లేదు. నీమీద నాకున్న అదుపులేని ప్రేమను నీకందించాలనే ప్రయత్నం లో నిన్ను బాధపెట్టుంటే నన్ను క్షమిస్తావు కదూ. మన జీవితానికీ , ప్రేమకీ పునాది నమ్మకం. అది ఒకరినొకరు అర్థం చేసుకుని ఎప్పుడూ కలిసుండేలా చేస్తుంది.

ఇది ఒక చిన్న ప్రయత్నమే కానీ , నా ప్రేమను ఉన్నదున్నట్టు వ్యక్తపరచడానికి కాగితాలు సరిపోతాయా?
అందుకే ఒకటి చెప్పనా... నేను నిన్ను నా ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమిస్తున్నాను.
ఎప్పటికైనా నేను నీ సొంతం...చీచీ...అలా కాదు. ఎప్పటికీ నేను నీ సొంతం.... సరేనా.... నీ నేను.




Sunday, April 26, 2009

సరదాగా ఒక కామెంట్ ప్లీజ్...


మన వా'నరుడు' భలే తమాషా గా వున్నాడు కదా!...... అంతకంటే తమాషాగా ఒక కామెంట్ విసరండి. సరదాగా....

Saturday, April 25, 2009

రక్త హీనతా?... ఇదిగో చిట్కా.



రక్త హీనత తో బాధపడుతున్నారా? ఐతే ఇవి మీకోసమే....
  • రోజూ ఒక కప్పు బీట్రూట్ రసంలో ఒక కప్పు ఆపిల్ రసం, కొద్దిగా తేనే కాని చక్కర కాని కలిపి తాగితే రక్తం వృద్ధి అవుతుంది.
  • బాగా పండిన అరటిపందుకు రెండు టీ స్పూన్ల తేనే కలిపి రోజుకు రెండుసార్లు తినాలి.
  • ఒక కప్పు ఆపిల్ రసానికి ఒక కప్పు టమాటో రసం కలిపి నాలుగు గంటలకోకసారి తాగితే ఎనీమియా(రక్త హీనత) నుండి త్వరగా బయటపడతారు.
  • రోజూ క్రమం తప్పకుండా రెండు టీ స్పూన్ల తేనే తింటే శరీరం కోల్పోయిన పోషకాలన్నీ అందుతాయి.
  • చేపలు,రొయ్యలు,వంటి సముద్ర ఆహారం, లివర్, గుడ్లు, వేరుశనగ గింజలు, బఠానీలు, కిస్మిస్ , ఖర్లూరాలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి.
  • ఎనీమియాతో బాధపడేవారు కాఫీ,టీ ఆవు పాలు తీసుకోకూడదు.
పైవన్నీ కూడా త్వరగా రక్తం వృద్ధి కావడానికి ఎంతో సహాయపడతాయి. మరి ఎందుకు ఆలస్యం ప్రయత్నించండి.

చిన్న సహాయం చేయగలరా....

రోజు మిట్ట మద్యాహ్నం పని ఉండి బయటకి వెళ్లాను , సచివాలయం దగ్గర , ఫ్లయ్ఓవర్ కింద కొంతమంది చాలా దయనీయంగా కనిపించారు. కొంతమంది అలా దరిద్రంగా డెకరేట్ చేసుకుని అడుక్కుతినడం మనం చాలా చోట్ల ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర చూస్తుంటాము, చిన్న పిల్లను చంకలో వేసుకుని ఏడుపు మొహంతో అడుక్కుతింటూ వుంటారు, వాళ్ళను చూస్తె అప్పుడప్పుడు కోపం కూడా వస్తుంది, వాళ్ళకి అదే మెయిన్ బిజినెస్ అని చూడగానే తెలిసిపోతుంది, కానీ నేను చెప్పేది వాళ్ల గురించి కాదు. వాళ నేను రెండు చేతులు భుజాలవరకు లేని ఒక ఆవిడ దయనీయంగా అడుక్కుటినడం చూసాను, అలాగే నడవడం కూడా చేతకాని ఒక పండు ముసలి వాణ్ణీ చూసాను, ఇంకా ఇలాంటి వాళ్లు ఎంతమంది కనిపిస్తారో అని అదేపనిగా గమనించడం మొదలుపెడితే కనిపించిన ఒక వ్యక్తి నన్ను ఇది రాయడానికి కదిలేలా చేసింది. ఆమెదొక దయనీయ పరిస్థితి అని చెప్పొచ్చు, ఆమె ఒక మతిస్థిమితం లేని ఒక మహిళ, వయసు ఒక పాతిక ఉండొచ్చు. ఒంటిమీద బట్టలు కూడా సరిగా లేవు , తనేం చేస్తుందో తనకే తెలియని పరిస్తితి , అలాంటి మహిళకు భద్రత వుంటుందా? ఆమెకి రోజు ఎలాగడుస్తుంది? ఇలాంటి ప్రశ్నలు నన్ను మనఃశ్శాంతి గా వుండనివ్వలేదు. ఇలాంటి వారికి సహాయం చేయడానికి ఏవైనా సేవా సంఘాలు ఉన్నాయా?వారికి సమాచారం అందిస్తే ఇలాంటి వారిని అక్కున చేర్చుంటారు కదా? మీ దగ్గర ఇలాంటి సేవా సంఘాల వారిగురించి ఏమైనా సమాచారం ఉంటే వారి అడ్రస్ కానీ, ఫోన్ నెంబర్ కానీ తెలియచేయగలరు, నేను కూడా ప్రయత్నిస్తాను. ఇదే నేనడిగిన చిన్న సహాయం , చేస్తారు కదూ? మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను.

కుటుంబం లో వచ్చిన(తెచ్చిన) మార్పు...

నా స్నేహితుడు సురేంద్ర , బాగా డబ్బు, పరపతి వున్న కుటుంబం , ఇంట్లో అందరూ మాంసాహారులే, ఎంతంటే...దాంతో ఊరగాయ పెట్టి మరీ సంవత్సరమంతా తింటారు. అంతిష్టం వాళ్ళకి మాంసాహారమంటే, ఇక ఊళ్ళో జాతర లాంటివి, ఇంట్లో ఏదైనా శుభకార్యం జరిగినా, మరుసటిరోజు యాట తెగాల్సిందే, దాన్నే కరి అంటారు మావైపు. మాది రాయలసీమ లెండి. మొన్నొకసారి నన్ను వాళ్ల ఊరికి రమ్మని పిలిచాడు, ఎంట్రా ఏమైనా విశేషమా? ఇంకేం ఇంట్లో ఓన్లీ నాన్ వెజ్ ఏమో కదా? నేనొస్తే నాకోసం వెజ్ ఐటమ్స్ చేయాలి అప్పుడు డబల్ పని కదర అమ్మ వాళ్ళకి వద్దులే అన్నాను. ఎందుకంటే నేను శాకాహారి ని లెండి. అప్పుడు వాడు" మా ఇంట్లో ఇప్పుడు అందరూ మాంసాహారం మానేశారు,నీతోపాటే అందరూ నువ్వు హ్యాపీ రావచ్చు" ఆనాడు. నాకు కొంచెం ఆశ్చర్యం వేసి అడిగా అప్పుడు వాడు చెప్పిన విషయం నాకు బాగా నచ్చి ఇక్కడ రాస్తున్నాను. ఒకరోజు మా సూరి వాళ్ల నాన్న కార్ డ్రైవ్ చేస్తూ వెళ్తున్నాడు, రోడ్ పైన జైనమత సన్యాశినులు నడుచుకుంటూ వెళ్తున్నారు, అందులో ఒక వయసెక్కువగా ఉన్న, నడవలేని ఒక ఆమెని ఒక సన్యాశిని వీల్ చైర్ లో తోసుకుంటూ తీసుకెల్తోంది. ఇంతలొ అనుకోకుండా ఆయన డ్రైవ్ చేస్తున్న కార్ అదుపుతప్పి ముసలామెని, వీల్ చైర్ తోసుకేల్తున్న సన్యాశిని ని తగిలే సరికి ఇద్దరికీ బాగా దెబ్బలు తగిలాయి. యన భయపడి ఏమైందో అని దగ్గరికెళ్ళి చూసాడు, పరిస్తితి కొంచెం సీరియస్ గానే అనిపించింది. ఇంతలొ అక్కడుండే వారంతాకోపంగా వెళ్లి పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నారు. ఆయన కి భయం వేసి " అమ్మ ఇప్పుడవేన్నీ ఎందుకు ముందు హాస్పిటల్ కి వెళదాం ఆమె కి ఏమీ కాదు, ఎంత ఖర్చైనా అంతా నేనే భరిస్తా" అని చెప్పాడు. అప్పుడు వాళ్ళకి ఏమనిపించిందో ఏమో, "మేము కూడా అలా మాట్లాడి వుండకూడదు, మాకు ఏమీ వద్దు నువ్వు మాకు ఒక మాట ఇవ్వు చాలు" అన్నారు. అదేంటంటే "ఇప్పటి నుండి మీరు మాంసాహారం తినడం మానేయాలి" అని. అలాగే ఆయన మాటిచ్చారు, ఇప్పటికీ మాట మీదే నిలబడ్డారు. అంతే కాదండీ ఇప్పుడు వాళ్ళింట్లో ఎవరూ మాంసాహారం ముట్టుకోవట్లేదు . ఏమీ ఆశించకుండా ఒక మంచి పనిని ఇంకొకరిచేత చేఇంచాలనుకోవడం వారి గొప్పతనమైతే, ఇచ్చినమాటకి కట్టుబడి మాటనిలబెట్టుకుంటున్న కుటుంబానిదీ గొప్పతనమే. అందుకే మీతో పంచుకోవాలనుకుంటున్నాను.

Thursday, April 23, 2009

స్త్రీ లకు ప్రత్యేక బస్సుల అవసరం....

అవునండీ స్త్రీలకు ప్రత్యేకంగా బస్సు సర్వీసులు కావాలి, ముఖ్యంగా మన హైదరాబాదు లో, మన సిటీ బస్సుల్లో మహిళలు చాల ఇబ్బందులకు గురవుతున్నారు, బాగా నిండిన బస్సుల్లో ఎక్కాలంటేనే చాలా ఖష్టంగా వుంటుంది, అప్పటికే విసిగిపోయి వుంటారు, దానికి తోడు సీట్ వుండకపోతే నరకమే, పది,పదిహేను నుముషాలకి ఒక సిగ్నల్ లైట్, ఎక్కడ పడితే అక్కడ ఎక్కే పాసింజర్స్ తో బస్ జాతరలాగా వుంటుంది. విపరీతమైన చిరాకు, మధ్య నేను ఒకటి గమనించాను. మహిళలు కూడా ఫుట్ బోర్డింగ్ చేస్తున్నారు. దిగి ఇంకో బస్ లో వెళ్ళొచ్చు కదా కదిలే బస్ లో ఫుట్ బోర్డింగ్ యెంత ప్రమాదం, ఇలా వేగంగా కదిలే బస్సులు ఎక్కలేక బస్ స్టాప్ లలో ఇంకో బస్ కోసం వేచి చూస్తూ నిలబడి పోతూ వుంటారు ఇంకొంతమంది, వచ్చే బస్ కూడా అలాగే వుంటుంది. మగవాళ్ళ సంగతి వేరు ఎలాగైనా ఎక్కి వెళ్ళిపోతారు. అక్కడక్కడ మహిళలకు ప్రత్యేకమైన బస్ సర్వీసు లు వున్నప్పటికీ అవి కొన్ని ప్రాంతాలకే పరిమితం. అంతే కాక బాగా కిక్కిరిసిన బస్ లలో ఆకతాయిల గోల, బయట బస్ స్టాప్ లలో కూడా అదే తంతు. బాగా చీకటి పడ్డ తర్వాత కూడా ఇంటికి చేరుకోలేక బిక్కు బిక్కు మంటూ బస్ స్టాప్ లో వుండిపోయే అమ్మాయిలను చూస్తె పాపం అనిపిస్తుంది. అంతే కాదు ఇంట్లో తల్లిదండ్రులకి కూడా టెన్షన్. అందుకే ప్రతీ ప్రాంతానికి కనీసం రెండు మూడు బస్సు సర్వీసు లన్నా ఆర్.టి.సి. నడపాల్సిన అవసరం మహిళలకు ఎంతైనా వుందంటాను. మీరేమంటారు?

మీరు ఒప్పుకుంటారా?

మనకున్న మూఢ నమ్మకాల్లో 'విగ్రహారాధన', కే అగ్ర తాంబూలం అని నేననుకుంటున్నాను మీరేమంటారు?
అవును ఐతే ఎందుకు?
కాదు ఐతే ఎందుకు?

Wednesday, April 22, 2009

ఇప్పటికీ బాధ పెడుతుంది......

ఒక రోజు అమీర్ పేట లో బస్ కోసం చూస్తున్నాను, కోటి కి వెళ్ళాలి, బస్ వచ్చింది బ్యాక్ సైడ్ ఫాస్ట్ గా ఎక్కబోయాను, ఇంతలొ బస్ నుండి ఐదుగురు హడావిడిగా దిగాబోయారు,వాళ్ళని చూసి నేనే దారిచ్చాను, తర్వాత బస్ ఎక్కి సీట్ కోసంవెతుకుతుంటే, ఒక పెద్దమనిషి వయసు సుమారు అరవై వుంటాయి, వున్నట్టుంది కింద నిస్సహాయంగాకూర్చుండిపోయాడు , మొహమంతా చమటలు, కళ్ళలో నీళ్లు, అరవలేక నోట మాట రాక , ఏదో అంటున్నాడు. నేనేమోమొదట హార్ట్ ఎటాక్ ఏమో అనుకున్నా,చెయ్యి పట్టుకుని పైకి లేపి ఏమైందని అడిగితే, చెప్పాడు తన దగ్గర నలభై వేలుపోయాయని. వివరంగా" పెద్దాయన అప్పుడే బ్యాంకు నుంచి డెబ్భై వేలు డ్రా చేసి ముప్పై వేలు ఒకవైపు, నలభై వేలుఒకవైపు నడుముకి అటు,ఇటు చేతిరుమాల్లతో కట్టుకుని బస్ ఎక్కాడు, అది గమనించిన ఐదు మంది దొంగ వెధవలుఆయననే అనుసరించి ఆయన్తోపాటే బస్ ఎక్కేసారు, పెద్దాయనకు సీట్ దొరకక నిల్చుంటే ,వీళ్ళు కూడా ప్రయానికుల్లాఆయనచుట్టు అనుమానం రాకుండా నిలబడి అదనుకోసం ఎదురు చూస్తున్నారు, ఇంతలొ బస్ స్టాప్ వచ్చేసరికిపెద్దాయన్ని కూడా తోసుకుంటూ బ్యాక్ డోర్ దగ్గరగా తీసుకువచ్చారు ,డోర్ రాగానే వాళ్ళలో కొంతమంది ప్రయాణికులకుకనపడకుండా చుట్టూ నిలబడగా మిగిలినవారు నలబై వేల కట్టను చాకచక్యంగా కొట్టేసి ఆలస్యం చేయకుండా పరుగుపరుగున దిగాబోయారు" అప్పుడే బస్ లోకి వస్తున్న నేను పాపం దిగే ప్రయాణికులు అనుకుని దారిచ్చను. పాపం పెద్దాయన అవసరం కోసం,ఎంత ఖష్టపడి ఎన్ని సంవత్సరాలనుండి కూడబెట్టుకున్నాడో డబ్బుని దొంగ వెధవలు ఒక్క పదినిముషాలలో దోచుకుపోయారు. అపుడు నాకు మా నాన్న గుర్తుకొచ్చాడు. మధ్యతరగతి కుటుంభం లో కుటుంభ పెద్ద ఒక్కొక్క పైసా కూడా అపురూపంగా దాచుకుంటాడు అవసరం అలాంటిది. డబ్బు కూతురు పెళ్ళికేకావచ్చు, ఎవరికయినా ఆపరేషన్ కి కావచ్చు, పిల్లల చదువుకి కావచ్చు, ఇవన్నీ దొంగ వెధవలకి అర్థం కాదు. వాళ్ళకికూడా అర్థమయ్యి మారాలని అనుకోవడం అత్యాశే ఐన అందులో ఒక్కడైనా అలోచించి తిరిగి డబ్బిచ్చేస్తే బాగుండునుఅనుకున్నాను. పాపం పెద్దాయన ఏడుస్తూ బస్ దిగి వాళ్ళకోసం పరుగెత్తిన దృశ్యం ఇప్పటికి నన్ను బాధ పెడుతూనేవుంటుంది ఎందుకంటే వెధవలకి నేనే దారిచ్చనే , ఒక్కడినైనా పట్టుకునే వీలుంది, కాని నేనేం చేయలేదే అని , నాకువాళ్లు దొంగలని తెలియకపోవచ్చు ,ఐనప్పటికీ నాకు బాధగానే వుంటుంది. అలాంటి వాళ్లు మార్చాలనుకోవడం కంటే మనంకొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మాత్రం మనవి. పెద్దాయన దొంగతనం జరిగిందని తెలియగానే షాక్ లో వుండిపోకుండాతేరుకుని గట్టిగ అరవడం లాంటివి చేసుంటే దొంగలు దొరికేవారేమో కదా , నాలాంటి వాడుకనీసం పట్టుకోవడానికి ప్రయత్నంచేసేవాడు కదా. ఏది ఏమైనా మన జాగ్రత్తల్లో మనం వుండడం మంచిది కదా, అంతే కాదు అలాంటి సమయాల్లోభయపడకుండా సమస్పూర్తిగా వ్యవహరించడం కూడా మన పనే. అలాంటి సమయాల్లో ఎవరినైనా సహాయంఅడగడానికి వెనుకాడవద్దు. పోయిన తర్వాత ఏడవడం ఒకటే మిగులుతుంది కదా .

Tuesday, April 21, 2009

ఇలా కూడా వుంటారా ?

ఇది నా జీవితం లో జరిగిన సంఘటన ఇంతవరకు ఎవరికీ చెప్పుకోలేదు, అంటే చెప్పకూడనిది కాదు కాని.. చెప్తే నవ్వుతారని... సరే ఇక విషయానికి వస్తే , అప్పుడు నేను వుద్యోగం కోసం బెంగుళూరు లో వుండే వాడిని , నెలకి సరిపడా నాన్న పంపించేవాడు, వందో రెండొందలో మిగిలేవి అంతే , సినిమాలంటూ వెళ్తే అవి కూడా గోవిందా.. అలాంటి టైం లో ఒకడు వెయ్యి రూపాయలు టోపీ పెట్టాడు, అదే చెప్పబోతున్నా ముందుగా ఒకటి చెప్పాలి నేను ముసలి వాళ్ళకి , ఆడవాళ్ళకి, అవిటి వాళ్ళకి తప్ప మరెవరికి డబ్బు దానంగా ఇవ్వను. చిన్న పిల్లలకి అస్సలు ఇవ్వను, అడుక్కోవడం అలవాటు చెయ్యకూడదని. అలాంటిది ఒకడి మాటలు నమ్మి వెయ్యి రూపాయలు ఇచ్చేశాను. ఇక విషయం లోకి వస్తే హైదరాబాద్ కి రావాలని 'కెంపెగౌడ' బస్స్టాండ్ కి వచాను, బస్ లేటు అని తెలిసి అలా షాపింగ్ మాల్స్ వుంటే చూద్దామని వెళ్లాను అక్కడేదో చిన్న గొడవ జరుగుతూ వుంది , చుస్తూవున్న నాకు పక్కనే వున్న తెలుగాయన పలకరించాడు. అడక్కుండానే గొడవగురించి చెప్పడం మొదలెట్టాడు." నాకు బంగళూరు వాళ్ళమీద నమ్మకం పూర్తిగా పోయింది "అన్నాడు. ఏమైంది ఆంటే " నాపేరు గుండు రమణారావు ఫిల్మ్ యాక్టర్ గుండు హనుమంతరావు కి తమ్ముడిని" అన్నాడు చూడ్డానికి అలాగే అనిపించాడు. "నేను వి.వి.వినాయక్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ పనిచేస్తున్నాను , నాకు పెళ్లి కుదిరింది మా ప్రొడ్యూసర్ కి కార్డ్ ఇద్దామని వచ్చాను కాని తను ఇక్కడ లేడు ఇంట్లో ఇచ్చి వచ్చాను కాల్ చేస్తే కూడా తగలట్లేదు, సరే అని హైదరాబాద్ కి వెళ్ళాలి అర్జెంట్ అని వస్తే నా పర్సు,సెల్ ఫోన్ ఎవడో కొట్టేసాడు, అందులో చాలా డబ్బు, క్రెడిట్ కార్డ్స్, వున్నాయి ఫోన్ చేద్దాము అన్నా నుంబెర్స్ కూడా లేవు, ఇలాంటి పరిస్థితి వస్తుంది అని కల లో కూడా అనుకోలేదు " అని కన్నీళ్లు పెట్టుకున్నాడు . నాకు వాడు చెప్పింది విని నిజమే ఏమో అనిపించింది. " నాకు టికెట్ కి డబ్బులివ్వండి మీరు కూడా హైదరాబాద్ కి వస్తున్నారు కదా, అక్కడికేల్లగానే మీరే చూడండి నా రేంజ్ ఏంటో ప్లీజ్ ఇలా అడుక్కోలేను ఎవరిని" అంటు ఏడుపు మొదలెట్టాడు. నాఖర్మ కాలి జేబులో వెయ్యి రూపాయల నోటు వుంది ఏం చేస్తున్నానో అర్తం కావట్లేదు అది కాస్త వాడి చేతిలో పెట్టేసాను. వాడు అర్జెంటు అంటాడు, ఫ్లైట్ , అంటాడు...... నాకు అర్తం కాక "డబ్బు ఇటివ్వండి నేను నీకు టికెట్ కొనిస్తాను నాతోపాటే వద్దూరు కాని" అన్నాను. అలా కాదు నేను ఇవాళ పొద్దున్నే అక్కడుండాలి, బస్ లో లేట్ అవుతుంది అర్తం చేస్కొండి అని ఒకటే గోల, చివరిగా నా ఫోన్ నెంబర్ తీసుకున్నాడు , నాకు వాడి మెయిల్ ఇడి ఇచ్చాడు. "మీరు నాకు మెయిల్ చేయండి వెంటనే మీ నెంబర్ కికాల్ చేస్తాను, కార్ పంపిస్తాను మీరు డైరెక్ట్ గా వచ్చేయండి అప్పుడు మీకే తెలుస్తుంది, నా స్టేటస్ ఏంటో" అని నా చేతులు పట్టుకున్నాడు. వాడు చూడ్డానికి గుండు హనుమతరావు లాగానే వున్నాడు , అందుకే నిజమే అని నమ్మాను. "థాంక్స్" చెప్పి వెళ్ళిపోయాడు. నాకు ఏమి అర్తం కాలేదు. తర్వాత వాడిచ్చిన మెయిల్ ఐడి తప్పని నేను మోసపోయానని తెలిసింది. నేను ఘోరంగా మోసపోయిన మొదటి సంఘటన ఇదే , ఇలాంటి వారు కూడా వుంటారు మీలో కొంతమంది ఐన జాగ్రత్త పడతారని రాస్తున్నా.