Tuesday, March 24, 2009

ఉపమానప్రమాణము

మూడవది ఉపమాన ప్రమాణము. వస్తువును ఉపమించి తెలుసుకొనడం. అంటే ఒకదాన్ని పోల్చి పోలికలను ఇంకొకదానిలో చూచి అది ఫలానా అని తెలుసుకొనడం. ఉదాహరణకు "గోసాద్రుస్యోగావాయ:" గోవు - ఆవు వంటిది గవయముగవయము" అంటే అడవి గోవు.గోవు లక్షణములే గవయమునకు ఉంటాయి. అని తెలుసుకుంటే అడవిలో దానినిచిసినపుడు అది గవయము అని గుర్తుపట్టగలం. ఇక్కడ 'సాద్రుశ్యో'జ్ఞానం వల్లనే వస్తువు తెలియబడుతుంది. కాబట్టిసాద్రుశ్యజ్ఞానం ఉపమానము అని భావము. "

Monday, March 23, 2009

అనుమాన ప్రమాణము

'అను' అంటే తరువాత , మానము అంటే తెలియబడుట. అనుమానము అంటే ముందు ఒక వస్తువును(ప్రత్యక్షముగా) చూసి, తరువాత దాని మూలముతో వేరొక వస్తువువుని ఊహించడం. ఉదాహరణకు పొగను చూసి అక్కడ నిప్పు ఉందనితెలుసుకొంటాం. నిప్పు ఉన్నచోట కొన్ని సమయాల్లో పొగ లేకపోవచ్చు, కాని పొగ ఉన్నచోట నిప్పు తప్పనిసరిగా ఉంటుంది. పొగను బట్టి నిప్పు ఉందని ఊహించడం జరుగుతుంది. ఇలా ఊహించడమే అనుమాన ప్రమాణము. దీనివల్ల కలిగినజ్ఞానము 'అనుమిత జ్ఞానం' అంటారు.

Sunday, March 22, 2009

వేదములు , ఉప్రమాణములు

సమస్త ధర్మములకు మూలము వేదములు. మానవునకు కావలసిన విజ్ఞానము సర్వమూ వేదములలో బీజరూపముగా అనగా సూక్ష్మ రూపముగా వున్నదని వైదికుల మతము. వేదములనే సంహితలు అని కూడా అంటారు. ఒక వస్తువు యొక్క అస్తిత్వమును అంగీకరించాలన్నా , నిరాకరించాలన్నా మనకు ప్రమాణమొకటి అవసరం. ప్రమాణములు నాలుగు విధములు. అవి ప్రత్యక్షము, అనుమానము, ఉపమానము, శబ్దము, అని నాలుగు విధములు. "లక్షణ ప్రమానాభ్యాం వస్తు సిద్ధి:"-లక్షణములను బట్టి, ప్రమాణములను బట్టి యిది ఫలానా వస్తువని నిర్ణించడంజరుగుతుంది. ప్రమ - అంటే జ్ఞానము. ప్రమాణము అంటే జ్ఞాన సాధనము . కన్నులు , చెవులు, ముక్కు, చర్మము, నాలుక అను ఇంద్రియముల ద్వారా జ్ఞానము కలుగును. కావున ఇంద్రియములు ప్రమాణములగును. వీనివలనకలుగు జ్ఞానము ప్రత్యక్షజ్ఞానమగును. అక్షి అంటే కన్ను, అక్షము అంటే ఇంద్రియము. ప్రతి + అక్షము = ప్రత్యక్షము. అంటే ప్రతి ఇంద్రియము. ఇంద్రియముద్వారా తెలియబడు జ్ఞానము ప్రత్యక్షజ్ఞానము అవుతుంది. నేత్రములద్వారాదృశ్యములు చూచి తెలుసుకొనడం, చేవులద్వారా శబ్దములను విని గ్రహించడం, చర్మముద్వారా స్పర్శజ్ఞానముకలగడము, ముక్కుద్వారా వాసనచూచి తెలుసుకొనడం యివన్నీకూడా ప్రత్యక్షజ్ఞానము క్రిందకి వస్తాయి.

తరువాతి పోస్ట్ లో అనుమాన ప్రమాణము తో కలుద్దాము....................

Saturday, March 7, 2009

లీడర్


నాయకుడు అంటే ఎలా వుండాలి అంటే మాత్రం తడుముకోకుండాచూపగలిగిన ఒకే ఒక ప్రత్యక్ష్య నిదర్శనం శ్రీ జయప్రకాష్ నారాయణ గారు.
ఆయన ఒక నిరంతర శ్రమ జీవి , విద్యార్థి , మహా సముద్రం , అచంచలమైనఆత్మవిశ్వాసం ఆయన సొంతం. దీక్ష , సహనం కలగలిపిన
ఒకేఒక మనీషి . సమాజ శ్రేయస్సు కోసం తన భవిష్యత్తును సైతం పణంగా పెట్టి , సంఘం లోఅభివృద్ధి కి ఆటంకంగా వున్న అవినీతి మీద యుద్ధ భేరి మోగించిన సేనాధిపతి ,
ఆయనకు రాజకీయ నాయకుడు అన్న పేరు కన్నా నవ సమాజ మార్గదర్శిఅన్న పేరే సరైనది. నిద్ర మత్తులో తేలియాడుతున్న నవ సమాజాన్ని అత్యుత్తమవిలువలు కలిగిన మార్గం లో నడిపించడానికి సిద్ధమైన మహా యోధుడికిమనమందరం ఊతమవ్వాలి........... మహత్కార్యం కేవలం మన భవిష్యత్తుకోసమని మరవకండి........ రండి..... మన బతుకు అతుకులను మహనీయుడి నాయకత్వం లో మనమే బాగు చేసుకుందాం.........
సరైన నాయకత్వమే మన ప్రగతి కి సోఫానం అని మరవకండి , మన కోసం , మన పిల్లల , అన్ని సామాజిక వర్గాలభవిష్యత్తు కోసం పోరాటాన్ని ఆరంభించిన శ్రీ జయప్రకాశ్ నారాయణ గారికి అండగా వుందాం.......... ఆలోచించండి
నాయకత్వం లో సత్తా కలిగిన లోక్ సత్తా కి అవకాశం ఇద్దాం.......... నీతి కలిగిన నవ సమాజాన్ని నిజాయితీ కలిగిన ఒకజ్ఞాని అడుగుజాడల్లో నడిపిద్దాం...... నడుద్దాం.... మనం కన్నకలలకు
సాకారాన్నిద్దాం.

మీ
ఓమ్ ప్రకాశార్య్

Swagatham

అందరికి నమస్కారం నేను మొదలు పెడుతున్న తెలుగు బ్లాగ్ అందరికి నచ్చేటట్లు వుంటుందని , మీరందరూ ఆదరిస్తారని ఆశిస్తున్నాను .